War 2 : నెగిటివ్ రివ్యూలు వచ్చినా భారీ కలెక్షన్లు.. హిందీ ప్రేక్షకులతో పాటు తెలుగు ఆడియెన్స్ సూపర్ సపోర్ట్

War 2 Box Office Collection Huge Earnings Despite Negative Reviews
x

War 2 : నెగిటివ్ రివ్యూలు వచ్చినా భారీ కలెక్షన్లు.. హిందీ ప్రేక్షకులతో పాటు తెలుగు ఆడియెన్స్ సూపర్ సపోర్ట్

Highlights

War 2 : నెగిటివ్ రివ్యూలు వచ్చినా భారీ కలెక్షన్లు.. హిందీ ప్రేక్షకులతో పాటు తెలుగు ఆడియెన్స్ సూపర్ సపోర్ట్

War 2 : బాలీవుడ్ యాక్షన్ స్టార్ హృతిక్ రోషన్, టాలీవుడ్ సెన్సేషన్ జూనియర్ ఎన్టీఆర్, కియారా అద్వానీ ప్రధాన పాత్రల్లో నటించిన వార్ 2 సినిమాకు భారీ అంచనాల మధ్య విడుదలైంది. ఫస్ట్ పార్ట్ వార్ ఎంతటి విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. అయితే, ఈ సీక్వెల్ కూడా అదే స్థాయిలో సక్సెస్ అవుతుందని అంతా భావించారు. కానీ, సినీ విశ్లేషకుల నుంచి ఈ సినిమాకు నెగటివ్ రివ్యూలు వచ్చాయి. అయినా సరే, బాక్సాఫీస్ వద్ద వార్ 2 భారీ కలెక్షన్లతో దూసుకుపోతోంది. సినిమాపై ఉన్న హైప్, భారీ స్టార్ కాస్ట్ కారణంగా ఈ అసాధారణ విజయం సాధ్యమైందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.

తెలుగులో భారీ వసూళ్లు

వార్ 2 మొదటి రోజు కలెక్షన్లు అంచనాలకు మించి ఉన్నాయి. తొలిరోజు ఈ సినిమా దేశవ్యాప్తంగా రూ.52 కోట్ల వసూళ్లు రాబట్టింది. హిందీ వెర్షన్‌లో రూ.29 కోట్లు వసూలు చేయగా, తెలుగు రాష్ట్రాల్లో మాత్రం అనూహ్యంగా రూ.23 కోట్లు కలెక్ట్ చేసింది. బాలీవుడ్ సినిమాలకు హిందీలో ఇంత తక్కువ ఓపెనింగ్ రావడం కాస్త నిరాశ కలిగించే అంశమే అయినా, తెలుగులో వచ్చిన భారీ వసూళ్లు మాత్రం అందరినీ ఆశ్చర్యపరిచాయి. ఈ కలెక్షన్లకు ప్రధాన కారణం సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ నటించడమే అని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ కారణంగా తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాకు అద్భుతమైన మద్దతు ఇచ్చారు.

వార్ 2 సినిమాకు వచ్చిన రివ్యూలు చాలా నిరుత్సాహపరిచాయి. సినిమాకు బలమైన కథనం లేదని, కేవలం యాక్షన్ సన్నివేశాలు, భారీ పోరాటాలు మాత్రమే ఉన్నాయని విమర్శకులు పేర్కొన్నారు. ఇద్దరు స్టార్ హీరోలు ఉన్నప్పటికీ, కథనంలో లోపాలు ఉండటం సినిమాకు పెద్ద మైనస్ అని చెబుతున్నారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా, డైరెక్షన్ పరంగా కూడా విఫలమైందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే, నెగటివ్ రివ్యూలు వచ్చినా, స్టార్ హీరోల ఇమేజ్, మునుపటి వార్ సినిమాపై ఉన్న అంచనాల వల్ల మొదటి రోజు కలెక్షన్లు మాత్రం భారీగా నమోదయ్యాయి. ఈ కలెక్షన్లు రాబోయే రోజుల్లో ఎలా ఉంటాయో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories