Wamiqa Gabbi: శివగామి పాత్ర కోసం ట్రైనింగ్ తీసుకుంటున్న హీరోయిన్

Wamiqa: కత్తి యుద్ధంలో ట్రైనింగ్ తీసుకుంటున్న వామిక

admin1
Published on: 13 Aug 2021 4:46 PM IST
Wamiqa Gabbi: శివగామి పాత్ర కోసం ట్రైనింగ్ తీసుకుంటున్న హీరోయిన్
X

Wamiqa Gabbi: శివగామి పాత్ర కోసం ట్రైనింగ్ తీసుకుంటున్న హీరోయిన్

Wamiqa: తెలుగు ప్రేక్షకులు గర్వంగా చెప్పుకోదగ్గ సినిమాలలో బాహుబలి కూడా ఒకటి. బాహుబలి సినిమాలో ప్రేక్షకులందరికీ నచ్చిన పాత్రల లో శివగామి పాత్ర కూడా ఒకటి. ఇప్పుడు ఆ పాత్ర ఆధారితంగా నే ఒక వెబ్ సిరీస్ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. "ద రైస్ అఫ్ శివగామి" అనే పవర్ఫుల్ టైటిల్తో నెట్ ఫ్లిక్స్ ఈ వెబ్ సిరీస్ ను మొదలుపెట్టింది. కానీ కొంత షూటింగ్ పూర్తయిన తర్వాత వారికి అవుట్ పుట్ అంతగా నచ్చకపోవడంతో నటీనటులు మరియు సాంకేతిక బృందాన్ని చాలావరకు మార్చేసి ఈ ప్రాజెక్టును మళ్లీ మొదలు పెట్టారు.

వామిక గబ్బి ఈ వెబ్ సిరీస్ లో శివగామి పాత్రలో కనిపించనున్నారు. షూటింగ్ త్వరలోనే పట్టలెక్కనుంది. అయితే ఈ వెబ్ సిరీస్ మొత్తం కేవలం శివగామి పాత్ర చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో దర్శకనిర్మాతలు వెబ్ సిరీస్ లో బోలెడు యాక్షన్ సన్నివేశాలు కూడా పెట్టారట. తన పాత్ర కోసం వామిక ఇప్పుడు ఖడ్గం తో ఫైటింగ్ నేర్చుకుంటోంది. తాజాగా వామిక కత్తి యుద్ధం లో ట్రైనింగ్ తీసుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తాజా సమాచారం ప్రకారం ఈ వెబ్ సిరీస్ లో నయనతార కూడా ఒక కీలక పాత్ర పోషించనున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్టు గురించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.


admin1

admin1

Next Story