Ramgopal Varma: ఆర్జీవి ‘వ్యూహం’, ‘శపథం’ సినిమాల ట్రైల‌ర్ అప్‌డేట్‌

Ramgopal Varma: టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్‌ వర్మ నిర్మాణంలో వ‌స్తున్న తాజా చిత్రాలు ‘వ్యూహం’, ‘శపథం’.

Shekhar G
Published on: 13 Feb 2024 12:41 PM IST
Vyooham And Shapadham Trailer Release 5 Pm Today
X

Ramgopal Varma: ఆర్జీవి ‘వ్యూహం’, ‘శపథం’ సినిమాల ట్రైల‌ర్ అప్‌డేట్‌

Ramgopal Varma: టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్‌ వర్మ నిర్మాణంలో వ‌స్తున్న తాజా చిత్రాలు ‘వ్యూహం’, ‘శపథం’. ఈ సినిమాలను రిలీజ్ కాకుండా సెన్సార్ బోర్డు అడ్డంకులు ఉన్న విష‌యం తెలిసిందే. కాగా తెలంగాణ హైకోర్టు సూచనలతో రెండోసారి సెన్సార్‌ సర్టిఫికేటును జారీ చేయడంతో ఈ సినిమా విడుద‌ల‌కు అడ్డంకులు తొలగిపోయాయి.

ఈ రెండు సినిమాలు వారం గ్యాప్ లో రిలీజ్ అవడానికి సిద్ధం గా ఉన్నాయి. మొదటి భాగం ‘వ్యూహం’ ఈ నెల 23న విడుద‌ల చేయ‌నుండ‌గా.. రెండో పార్ట్ ‘శపథం’ ను మార్చి 01న విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ఆర్జీవీ ప్ర‌క‌టించాడు. రిలీజ్ డేట్లు దగ్గర పాడడంతో మూవీ టీం ప్రొమోషన్స్ లో స్పీడ్ పెంచారు. దానిలో భాగంగా మూవీ ట్రైలర్ అప్‌డేట్ ఇచ్చారు.

ఈరోజు సాయంత్రం 5 గంట‌ల‌కి రెండు సినిమాలకు సంబందించిన ట్రైలర్లను విడుదల చేయనునంటూ ఆర్జీవీ సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌క‌టించాడు. ఇక తొలిపార్టు ‘వ్యూహం’లో YSR మరణం తర్వాత ఏం జరిగిందని.. రెండో పార్ట్‌లో జగన్ ఎలా సీఎం అయ్యాడు అనే కాన్సెప్ట్‌తో రామ్‌గోపాల్‌ వర్మ ఈ రెండు సినిమాలను తెరకెక్కించాడు.


Shekhar G

Shekhar G

Next Story