Bigg Boss 5 Promo: కరాబ్ అయితదని తినేసి కడుపుబ్బా నవ్వించిన సన్నీ

* బిగ్ బాస్ సీజన్ 5 బుధవారం (10/11/2021) ప్రోమో విడుదల

Sruthi
Updated on: 10 Nov 2021 2:55 PM IST
Vj Sunny Eats Cake and it Portrays in Funny Way in Bigg Boss Telugu 5 Wednesday Episode Promo 10 11 2021
X

Bigg Boss Season 5 Telugu (Photo: Star Maa)

Bigg Boss Telugu 5 - Vj Sunny: బిగ్ బాస్ సీజన్ 5 లో ఇంటి సభ్యులతో కొన్ని సందర్భాల్లో గొడవపడటంతో పాటు అంతకు మించి నవ్వించడంలోను అదే స్థాయిలో బుల్లితెర ప్రేక్షకులకు తన నుండి ఏ మాత్రం ఎంటర్టైన్మెంట్ తగ్గేదేలే అన్నట్టుగా బిగ్ బాస్ హౌస్ లో తన కామెడీతో నవ్వించే మొదటి వ్యక్తి విజే సన్నీ అని గత కొన్ని వారాలుగా బిగ్ బాస్ చూసే అభిమానులకు తెలుసు. తాజాగా విడుదలైన ప్రోమోలో బిగ్ బాస్ గార్డెన్ ఏరియాలో ఉంచిన ఒక కేక్ ఐటెంని తినడానికి "ఇది తినే అర్హుత ఎవరికీ ఉంది???" అనే ప్రశ్నకి సమాధానం దొరకక ఒక రోజంతా తర్జనభర్జన పడిన ఇంటి సభ్యులకు షాక్ ఇస్తూ సన్నీ ఆ కేకును తినేశాడు.

మొదటగా ఇంటి కెప్టెన్ తానే కాబట్టి ఆ ఫుడ్ తినే అర్హత నాకే ఉందని ఆనీ మాస్టర్ చెప్పినా బిగ్ బాస్ వైపు నుండి ఎలాంటి స్పందన రాకపోవడంతో సైలెంట్ గా వెళ్ళిపోతుంది ఆనీ మాస్టర్. ఇక మరుసటి రోజు మానస్ ని విజే సన్నీ అసలు ఆ ఫుడ్ తినకుండా కెప్టెన్ ఆపొచ్చని ఏదైనా రూల్ ఉందా అని అడగడం దానికి మానస్ అలాంటిదేమి లేదని చెప్పడంతో సన్నీ ఏదైతే అది అయింది అంటూ వెళ్లి ఆ కేకు తినడంతో ఇంటి సభ్యులు షాక్ అవుతారు.. ఆ కేకు తిన్న తరువాత సన్నీ ఇప్పుడు ఏమి పంచాయతీ పెడుతారో అంటూ బయపడటం.., ఫుడ్ కరాబ్ అయితది అని తింటున్న సర్ అని బిగ్ బాస్ కి విజే సన్నీ చెప్పిన మాటలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుందని ప్రోమో చూస్తే తెలుస్తుంది. ఇక ఇప్పటివరకు విడుదలైన బిగ్ బాస్ 5 ప్రోమోలలో ఈ రోజు విడుదలైన ఈ ప్రోమో సన్నీ కామెడీతో బెస్ట్ ప్రోమో అని చెప్పొచ్చు.


Sruthi

Sruthi

SEO Executive

Next Story