మహేష్ బాబు కోసం హైదరాబాద్ వచ్చిన వైజాగ్ బీచ్

మహేష్ బాబు కోసం హైదరాబాద్ వచ్చిన వైజాగ్ బీచ్

Rama Rao
Updated on: 10 May 2022 1:31 PM IST
Vizag Beach setup that Came to Hyderabad for Mahesh Babu
X

మహేష్ బాబు కోసం హైదరాబాద్ వచ్చిన వైజాగ్ బీచ్

Sarkaru Vaari Paata: కొన్ని కొన్ని సార్లు సినిమాలలో బీచ్ చెట్లు అవసరం అవుతూ ఉంటాయి. బీచ్ కోసం వైజాగ్ దాకా వెళ్ళలేని కొంతమంది నిర్మాతలు తమ డబ్బులతో సముద్రాన్ని హైదరాబాద్ కు తీసుకొస్తుంటారు. తాజాగా మహేష్ బాబు హీరోగా నటిస్తున్న "సర్కారు వారి పాట" సినిమా నిర్మాతలు కూడా అదే చేశారు. ఈ సినిమాకు సంబంధించిన కొన్ని సన్నివేశాలను వైజాగ్ లోని ఆర్కే బీచ్ లో చిత్రీకరించారు. బీచ్ బ్యాక్ డ్రాప్ లో ఒక భారీ యాక్షన్ సన్నివేశం ఉంటుందట.

కానీ వైజాగ్ బీచ్ లో ఏ టైంలో అయినా జనాలు ఉంటూనే ఉంటారు. మహేష్ బాబు లాంటి హీరో వస్తే ఇక జన సమూహాన్ని ఎవరు ఆపలేరు. మహేష్ బాబు కూడా ఇదే విషయాన్ని డైరెక్టర్ పరుశురాం కి చెప్పారట. ఈ నేపథ్యంలోనే చిత్ర ప్రొడక్షన్ బృందం విజువల్ ఎఫెక్ట్స్ టీంతో కలిసి హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీ లోనే ఆర్కే బీచ్ సెటప్ ను ఏర్పాటు చేసింది. విజువల్ ఎఫెక్ట్స్ ను ఉపయోగించి సముద్రాన్ని వెండి తెరపై చూపించనున్నారట.

దీనికి సంబంధించిన విజువల్స్ చాలా అర్జెంట్ గా ఉండబోతున్నాయని చిత్ర బృందం చెబుతోంది. షూటింగ్ పూర్తయిన తర్వాత ఆ సీక్వెన్స్ ని చూసి మహేష్ బాబు కూడా చాలా ఎగ్జిట్ అయ్యారని దానికి సంబంధించిన కొన్ని విజువల్స్ ని ట్రైలర్ లో కూడా పెట్టినట్లు తెలుస్తోంది. ఇలా మహేష్ బాబు కోసం చిత్రబృందం వైజాగ్ బీచ్ ని హైదరాబాద్ దాకా తీసుకు వచ్చేసింది.

Rama Rao

Rama Rao

Next Story