ప్రకాష్ రాజ్ కామెంట్స్‌పై ఘాటుగా స్పందించిన కశ్మీర్‌ ఫైల్స్‌ డైరెక్టర్‌

Vivek Agnihotri: ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలపై విరుచుకుపడ్డ బాలీవుడ్ డైరెక్టర్

Jyothi
Published on: 10 Feb 2023 4:18 PM IST
Vivek Agnihotri Reacts to Prakash Raj Shocking Comments
X

ప్రకాష్ రాజ్ షాకింగ్ కామెంట్లపై రియాక్ట్ అయిన వివేక్ అగ్నిహోత్రి

Vivek Agnihotri: ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి కాశ్మీర్ పండిట్ల పై జరిగిన నరమేధం నేపథ్యంలో తెరకెక్కించిన సినిమా "ది కాశ్మీరీ ఫైల్స్". ఈ సినిమా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీనిపై ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ తీవ్ర వ్యాఖ్యలు కూడా చేశారు. ఇది ఒక చెత్త సినిమా అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపించారు. దర్శకుడు కి భాస్కర్ అవార్డు రావడం సమంజసం కాదంటూ విరుచుకుపడ్డారు.

"ఆ చిత్రాన్ని ఎవరు నిర్మించారో మాకు తెలుసు. అది సిగ్గులేనితనం. ఇంటర్నేషనల్ జూరీ కూడా పట్టించుకోలేదు కానీ వారికి మాత్రం సిగ్గు రాలేదు," అంటూ చాలా ఘాటుగా రియాక్ట్ అయ్యారు ప్రకాష్ రాజ్. ఇప్పటికి కూడా తనకి ఆస్కార్ రాలేదని అడుగుతున్నాడు కానీ తనకి ఆస్కార్ కాదు భాస్కర్ అవార్డు కూడా రాదని ఎగతాళి చేశారు. ఇక ఈ మధ్య ట్రెండ్ అవుతున్నా బాయ్ కాట్ పఠాన్ పై స్పందించిన ప్రకాష్ రాజ్ మొరిగే కుక్కలు కరవవు అంటూ షాకింగ్ కామెంట్లు చేశారు. తాజాగా ఇప్పుడు "ది కాశ్మీరీ ఫైల్స్" సినిమాపై ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలపై డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి మండిపడ్డారు.

ప్రకాష్ రాజ్ ను 'అంథ్కార్ రాజ్' అంటూ సంబోధిస్తూ వివేక్ అగ్నిహోత్రి ఓ వీడియోని షేర్ చేశారు. "ది కశ్మీర్ ఫైల్స్ ఒక చిన్న సినిమా. చిన్నవారి సినిమా. ఈ సినిమా కొంత మంది అర్బన్ నక్సల్స్ కు ఏడాది అయినా కూడా నిద్రలేకుండా చేస్తోంది. కొందరు వీవర్స్ ను మొరిగే కుక్కలు అని సంబోధిస్తున్నారు. మిస్టర్ 'అంథ్కార్ రాజ్' భాస్కర్ అవార్డ్ ని ఎలా అందుకోవాలో నాకు తెలుసు కానీ అది ఎప్పటికీ నీకే సొంతం," అని స్పందించారు.

Jyothi

Jyothi

Next Story