నేను ఆ రోజు నిద్రమాత్రలు మింగిన మాట నిజమే!

vithika sheru
x
vithika sheru
Highlights

ఉదయం పూట నన్ను నిద్ర నుండి లేపెందుకు మా మమ్మీ వచ్చింది. కానీ నేను ఇంతకి లేవకపోవడంతో నన్ను ఆసుపత్రికి తీసుకువెళ్ళారు.

వితికా షెరు, వరుణ్ సందేశ్‌లు తెలుగు బిగ్ బాస్ థర్డ్ సీజన్ లోకి క్రేజీ కపుల్‌గా అడుగుపెట్టారు. ఇందులో వరుణ్ సందేశ్ చివరి వరకు ఉండగా, వితికా 13వ వారంలో ఎలిమినేట్ అయింది. హౌస్ నుండి బయటకు వచ్చిన తర్వాత వితికా పలు ఛానల్స్ కి ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీగా మారిపోయింది. అందులో భాగంగానే ఓ ప్రముఖ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది వితికా.. ఇందులో తన వ్యక్తిగత జీవితంలో జరిగిన కొన్ని విషయాలను చెప్పుకొచ్చింది.

గతంలో వితికా ఆత్మహత్యాయత్నం చేసుకుంది అని వార్త వచ్చిన సంగతి తెలిసిందే.. అయితే ఈ వార్తపైన వితికా స్పందిస్తూ " నేను స్లీపింగ్ టాబ్లెట్స్ తీసుకున్న మాట వాస్తవమే.. కానీ అలా ఎందుకంటే.. నేను ఆర్నెల్లు యూఎస్‌లో ఉండి వచ్చాను. ఇక్కడికి వచ్చాక నాకు నిద్ర సరిగ్గా పట్టకపోవడంతో నా అసిస్టెంట్ తో స్లీపింగ్ టాబ్లెట్స్ తెప్పించాను. అది కూడా 0.5 ఎమ్. జీ పవర్ మాత్రమే.. అలా ఒక టాబ్లెట్ వేసుకున్న తర్వాత నాకు నిద్ర పట్టలేదు. మళ్లీ మరొకటి వేసుకున్నాను అయిన నిద్ర పట్టలేదు. అలా నాలుగు టాబ్లెట్స్ వేసుకున్న గంటకి నిద్ర పట్టింది. అలా ఆ రోజు రాత్రి 1 గంటకు నేను నిద్ర పోయాను.

ఇక ఉదయం పూట నన్ను నిద్ర నుండి లేపెందుకు మా అమ్మ వచ్చింది. కానీ నేను ఎంతకి లేవకపోవడంతో కంగారు పడి నన్ను ఆసుపత్రికి తీసుకువెళ్ళారు. అక్కడ స్టమక్ క్లీన్ చేసారు.. ఆ రోజు సాయింత్రం నేను ఆసుపత్రి నుంచి డిస్చార్చ్ అయ్యాను. కానీ నా ఫోన్ లో తీసిన ఫోటో, ఓ ఫ్రెండ్ ద్వారా బయటకు వెళ్లి వితికా సూసైడ్ చేసుకుంది అని వార్తలు వచ్చాయని చెప్పుకొచ్చింది" వితికా..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories