‘విశ్వంభర’ ఐటెం సాంగ్.. కీరవాణి సలహాతోనే భీమ్స్ సిసిరోలియో

‘విశ్వంభర’ ఐటెం సాంగ్.. కీరవాణి సలహాతోనే భీమ్స్ సిసిరోలియో
x

‘విశ్వంభర’ ఐటెం సాంగ్.. కీరవాణి సలహాతోనే భీమ్స్ సిసిరోలియో

Highlights

హైదరాబాద్‌: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘విశ్వంభర’ సినిమాకు సంగీతం అందిస్తున్న ఆస్కార్‌ విన్నింగ్ మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఎం.ఎం. కీరవాణిని...

హైదరాబాద్‌: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘విశ్వంభర’ సినిమాకు సంగీతం అందిస్తున్న ఆస్కార్‌ విన్నింగ్ మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఎం.ఎం. కీరవాణిని అవమానించారంటూ సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. కారణం – ఈ చిత్రంలోని ఒక ఐటెం సాంగ్‌ను భీమ్స్ సిసిరోలియోతో చేయించడం.

దక్షిణాదిలో అరుదైన పద్ధతి

బాలీవుడ్‌లో ఒక సినిమాకు వేర్వేరు సంగీత దర్శకులు పాటలు, బ్యాగ్రౌండ్ స్కోర్‌ చేయడం సాధారణమే. కానీ దక్షిణాదిలో మాత్రం ఒకే సంగీత దర్శకుడు అన్నీ చేయాలనే ఆచారం ఉంది. గతంలో ‘పుష్ప 2’లో కొన్ని సీన్లకు వేరే సంగీత దర్శకుడు బ్యాగ్రౌండ్ స్కోర్ అందించడంతో దేవిశ్రీ ప్రసాద్ హర్ట్‌ అయిన సంగతి తెలిసిందే.

వశిష్ఠ క్లారిటీ ఇచ్చాడు

ఈ వివాదంపై దర్శకుడు వశిష్ఠ స్పందించాడు. “కీరవాణిని ఎవరూ అవమానించలేదు. ఈ పాటను భీమ్స్ చేయడమే ఆయన సలహా. ఆ సమయంలో కీరవాణి ‘హరిహర వీరమల్లు’ సినిమాకు సంబంధించిన బ్యాగ్రౌండ్ స్కోర్ పనుల్లో బిజీగా ఉన్నారు. అందుకే ఈ పాటను వేరే సంగీత దర్శకుడితో చేయించండి అని ఆయనే సూచించారు” అని తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories