Vishwak Sen: 'నా క్రష్ ఎప్పటికి ఆమెనే' అంటోన్న పాగల్ హీరో

Vishwak Sen: తక్కువ సినిమాలతో ఎక్కువ క్రేజ్ సంపాధించిన హీరోలలో విశ్వక్‌సేన్ ఒకరు.

Venkata Chari
Published on: 26 April 2021 9:56 PM IST
Vishwaksen Says His Childhood Crush Is Heroine Ileana D Cruz
X

విశ్వక్ సేన్ (ఫొటో ట్విట్టర్)

Vishwak Sen: తక్కువ సినిమాలతో ఎక్కువ క్రేజ్ సంపాధించిన హీరోలలో విశ్వక్‌సేన్ ఒకరు. అయితే తనకు ఓ హీరోయిన్ అంటే పిచ్చి అంటూ బాంబ్ పేల్చాడు ఈ యంగ్ హీరో.

తాజాగా ఓ ఇంటర్య్వూలో మాట్లాడిన విశ్వక్‌సేన్.. ఎన్నో ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. గోవా బ్యూటీ ఇలియానా అంటే తనకు పిచ్చని, ఆమెపై తనకున్న అభిమానాన్ని మాటల్లో చెప్పలేనని వెల్లడించాడు.

''చిన్న తనం నుంచి ఇలియానా అంటే ఎంతో అభిమానం. ఆమె పోస్టర్లు ఎక్కడ కనిపించినా.. వెంటనే ఇంటికి తెచ్చుకొనే వాడిని. ఆమె ఫోటోషూట్‌లు ఏది మిస్ కాలేదు. ఇప్పటికీ నా మనస్సు మారలేదు. ఇలియానాపై అభిమానం అలాగే ఉంది. ఎప్పటికీ ఆమెనే నా క్రష్ '' అని విశ్వక్ వెల్లడించాడు.

కాగా విశ్వక్ ప్రస్తుతం 'పాగల్' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో సిమ్రన్ చౌదరీ, నివేదా పేతురాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

Venkata Chari

Venkata Chari

Next Story