Vishwaksen: స్క్రిప్ట్‌లతో కుస్తీ పడుతోన్న ఫ‌ల‌క్‌నుమాదాస్‌!

Vishwaksen: విశ్వక్ సేన్ చేతిలో ప్రస్తుతం రెండు సినిమాలు ఉన్నాయి.

Venkata Chari
Updated on: 27 May 2021 9:00 PM IST
Vishwaksen making use of lockdown totally!
X

విశ్వక్ సేన్ (ఫొటో ట్విట్టర్) 

Vishwaksen: విశ్వక్ సేన్ చేతిలో ప్రస్తుతం రెండు సినిమాలు ఉన్నాయి. వాటిలో ఒకటి 'పాగల్' కాగా, మరొకటి తమిళ చిత్రం ఓహ్ మై కడావులే రీమేక్. కరోనా మహమ్మారి కారణంగా పాగల్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యం అవుతున్నాయి. దీంతో విశ్వక్ సేన్ ప్రస్తుతం డబ్బింగ్ పనులు పూర్తిచేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.

అన్ని జాగ్రత్తలతో డబ్బింగ్ పనులు పూర్తి చేస్తున్నట్లు మేకర్స్ వెల్లడించినట్లు సమాచారం. కాగా, ఈ సినిమా ఈ నెలలో విడుదల కావాల్సి ఉంది. కరోనా సెకండ్ వేవ్‌తో విడుదలను వాయిదా వేశారు. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నట్లు ఫిల్మ్ యూనిట్ పేర్కొంది.

కరోనా తరువాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు విశ్వక్ సేన్ ప్లాన్ చేస్తున్నాడంట. ఈ యువ హీరో ప్రస్తుతం కొన్ని ప్రాజెక్టులను వింటున్నాడంట. లాక్‌డౌన్‌లో పూర్తిగా కథలను ఫైనల్ చేసే పనిలో ఉన్నట్లు పేర్కొన్నాడు. ఈ నగరానికి ఏమైంది, ఫ‌ల‌క్‌నుమాదాస్‌తో విశ్వక్ తెలుగులో పేరు సంపాధించాడు.

Venkata Chari

Venkata Chari

Next Story