vishwaksen: ఓ యూట్యూబ్ ఛానల్ పై విశ్వక్ సేన్ ఫైరింగ్

Vishwaksen: ఓ యూట్యూబ్‌ ఛానల్‌పై యువ టాలీవుడ్ హీర్ విశ్వక్‌సేన్‌ తీవ్రంగా మండిపడ్డారు.

Venkata Chari
Published on: 22 Feb 2021 7:05 PM IST
Vishwaksen Fires on Youtube Channel
X

విశ్వక్ సేన్ (ఫోటో ట్విట్టర్ )

Vishwaksen: ఓ యూట్యూబ్‌ ఛానల్‌పై యువ టాలీవుడ్ హీర్ విశ్వక్‌సేన్‌ తీవ్రంగా మండిపడ్డారు. ఇబ్బందికరమైన హెడ్డింగ్ తో యూట్యూబ్ లో ఓ వీడియోను పోస్టు చేసినందుకు సంబంధింత ఛానల్ పై ఫైరింగ్ అయ్యారు. ఇలాంటి వీడియోలు పెట్టేముందు మన ఇళ్లల్లో కూడా ఆడవాళ్లు ఉన్నారన్న విషయం గుర్తుంచుకుంటే మంచిదని, ఇంగితజ్ఞానంతో వ్యవహరించాలని సూచించాడు. సదరు వీడియో పెట్టిన వ్యక్తి 24గంటల్లో సారీ చెబుతూ ఇంకో వీడియో పోస్టు చేయకపోతే..అడ్రస్ తెలుసుకుని మరీ మీ ఇంటికి వచ్చి వీడియో నీతోనే అప్ లోడ్ చేసిస్తానని గట్టిగా హెచ్చరించాడు. అసలేం జరిగిందంటే..

నందితశ్వేత హీరోయిన్‌గా నటిస్తున్న 'అక్షర' చిత్రంలోని ఓ పాట విడుదల కార్యక్రమం ఆదివారం రాత్రి జరిగింది. దానికి విశ్వక్‌సేన్‌ స్పెషల్ గెస్టుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా.. విశ్వక్‌ గురించి హీరోయిన్‌ హీరోయిన్ నందిత మాట్లాడుతూ.. ఈ కార్యక్రమానికి విశ్వక్‌సేన్‌ రావడం సంతోషంగా ఉందని.. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేసింది. అయితే.. ఆ వీడియోను ఓ యూట్యూబ్‌ ఛానల్‌లో అర్థం మార్చి ఇబ్బందికరమైన థంబ్‌నైల్‌తో పోస్టు అప్ లోడ్ చేశారు. ఇది విశ్వక్‌సేన్‌ దృష్టికి చేరుకోవడంతో.. ఆయన ఈ విషయంపై తీవ్రంగా అసహనం వ్యక్తం చేస్తూ ఓ వీడియో పోస్టు చేశారు. యూట్యూబ్ లో పాపులారిటీ కోసం ఇలాంటి చెత్త వీడియోలు పెట్టడం మంచిది కాదని హెచ్చరించారు.

Venkata Chari

Venkata Chari

Next Story