Nivetha Pethuraj: టాలీవుడ్ లోకేష్ కనకరాజ్ తనే.. బాలకృష్ణను డైరెక్ట్ చేయగలడు..

Nivetha Pethuraj: "విశ్వక్ సేన్ టాలీవుడ్ లోకేష్ కనగరాజ్ అయిపోతాడు," అంటున్న హీరోయిన్

Jyothi
Updated on: 21 March 2023 8:31 PM IST
Vishwak Sen Will Become the Lokesh Kanagaraj of Tollywood Says the Heroine
X

"విశ్వక్ సేన్ టాలీవుడ్ లోకేష్ కనగరాజ్ అయిపోతాడు," అంటున్న హీరోయిన్

Nivetha Pethuraj: యువ హీరో విశ్వక్ సేన్ మరియు నివేదా పేతురాజ్ హీరో హీరోయిన్లుగా నటించిన "దాస్‌ కా ధమ్కీ" సినిమా త్వరలోనే విడుదల కి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్ తో బిజీగా ఉంది చిత్ర బృందం. విశ్వక్ సేన్ హీరోగా స్వీయ దర్శకత్వంలో నటించిన సినిమా ఇది. ఈ మధ్యనే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ కి ప్రేక్షకుల నుంచి అనూహ్య స్పందన లభించింది. తాజాగా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పలు ఇంటర్వ్యూలలో మాట్లాడుతూ సినిమాలో హీరోయిన్ గా నటించిన నివేదా సినిమా పై కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. విశ్వక్ సేన్ పై ప్రశంసల వర్షం కురిపించింది.

"హీరో తన సినిమాని తానే నిర్మించుకోవడం అంత గొప్ప విషయం కాదు. కానీ దర్శకత్వం వహించటం అనేది చాలా పెద్ద బాధ్యత. కానీ ఈ సినిమాకి విశ్వక్ సేన్ హీరోగా, నిర్మాతగా, మరియు డైరెక్టర్ గా మూడు బాధ్యతలు తీసుకున్నాడు," అని చెప్పుకొచ్చింది నివేదా పేతురాజ్. "ఒక నిర్మాతగా సినిమాకి పూర్తి న్యాయం చేశాడు. సినిమాకి ఏం కావాలో అన్నీ చేశాడు. ఒక డైరెక్టర్ గా తన ఎనర్జీ అద్భుతం. త్రివిక్రమ్ తర్వాత అంత ఎనర్జీ విశ్వక్ సేన్ దగ్గరే చూశాను. మిగతా హీరోలకి కూడా తను డైరెక్టర్ గా చేస్తే బాగుంటుంది.

విశ్వక్ సేన్ కి ఉన్న మాస్ టచ్ కి టాలీవుడ్ లోకేష్ కనగరాజ్ గా మారతాడు. బాలకృష్ణ వంటి మాస్ హీరోలను సైతం డైరెక్ట్ చేయగలడు. పైగా తనకి గ్యాంగ్స్టర్ సినిమాలు అంటే చాలా ఇష్టం. మంచి గ్యాంగ్స్టర్ సినిమాలు తీస్తాడు," అని విశ్వక్ సేన్ ని ఆకాశానికి ఎత్తేసింది నివేదా. అంతేకాకుండా "దాస్‌ కా ధమ్కీ" విశ్వక్ సేన్ కరియర్ లోనే పెద్ద హిట్ అవుతుంది, అని అన్న నివేద ఇది ఒక పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ అని విశ్వక్ సేన్ కరియర్ లో ఈ సినిమా ఒక మైలురాయి చిత్రంగా మిగులుతుందని అంటుంది.

Jyothi

Jyothi

Next Story