Vishwak Sen: మొదటిసారిగా అలాంటి పాత్ర చేయబోతున్న విశ్వక్ సేన్...

Vishwak Sen: మొదటిసారిగా అలాంటి పాత్ర చేయబోతున్న విశ్వక్ సేన్

Jyothi
Updated on: 17 March 2023 9:30 PM IST
Vishwak Sen Will Be Seen In A Negative Role
X

Vishwak Sen: నెగిటివ్ పాత్రలో కనిపించబోతున్న విశ్వక్ సేన్

Vishwak Sen: ఈ మధ్యనే "అశోకవనంలో అర్జున కళ్యాణం" సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న యువ హీరో విశ్వక్ సేన్ "ఓరి దేవుడో" సినిమాతో పర్వాలేదు అనిపించారు. "ముఖచిత్రం" సినిమాలో ఎక్స్టెండెడ్ క్యామియో పాత్రలో కనిపించిన విశ్వక్ ఇప్పుడు "దాస్ కా దంకీ" అనే సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు. ఈ సినిమాకి విశ్వక్ సేన్ స్వయంగా దర్శకత్వం కూడా వహిస్తున్నాడు. యాక్షన్ కామెడీగా త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో విశ్వక్ సేన్ మొదటిసారిగా డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నాడు.

వన్మయి క్రియేషన్స్ మరియు విశ్వక్ సేన్ సినిమాస్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. ఈ సినిమా ఈనెల 22వ తేదీన థియేటర్లలో విడుదల కి సిద్ధమవుతోంది. ఈ సినిమా తర్వాత విశ్వక్ సేన్ "గామీ" అనే సినిమాలో నటిస్తున్నాడు. ప్రస్తుతం నిర్మాణాంతర పనులతో ఈ చిత్ర బృందం బిజీగా ఉంది. అంతే కాకుండా "అక్టోబర్ 31 లేడీస్ నైట్" అనే సినిమాలో కూడా ఒక క్యామియో పాత్రలో కనిపించనున్నాడు విశ్వక్ సేన్. అయితే తాజా సమాచారం ప్రకారం వీటిలో ఏదో ఒక సినిమాలో విశ్వక్ సేన్ ఒక నెగటివ్ పాత్రలో కనిపించబోతున్నారట.

ఇప్పటిదాకా కనిపించినటువంటి ఒక నెగిటివ్ గ్రే షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఆ సినిమా ఏంటి అనే విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఇలాంటి పాత్రలో విశ్వక్ సేన్ ని చూడడానికి అభిమానులు కూడా ఆసక్తిగానే ఎదురుచూస్తున్నారు.

Jyothi

Jyothi

Next Story