Vishwak Sen: చేతులు మారిన కథ.. శర్వానంద్‌ అనుకుంటే..?

Vishwak Sen Signs For Sithara Entertainments
x

Vishwak Sen: చేతులు మారిన కథ.. శర్వానంద్‌ అనుకుంటే..?

Highlights

సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సినిమా సైన్ చేసిన విశ్వక్ సేన్

Vishwak Sen: ఈ మధ్యనే ఓరి దేవుడా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన యువ హీరో విశ్వక్ సేన్ తాజాగా ఇప్పుడు తన తదుపరి సినిమా "దాస్ కా ధమ్ కీ" సినిమాతో బిజీగా ఉన్నారు. స్వీయ దర్శకత్వంలోనే విశ్వక్ సేన్ ఈ సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తయింది. త్వరలోనే ఈ సినిమా తన కెరియర్ లోనే మొట్టమొదటి ప్యాన్ ఇండియా సినిమాగా విడుదల కి సిద్ధమవుతోంది. తెలుగులో మాత్రమే కాక ఈ సినిమా ఇంకో నాలుగు భాషల్లో కూడా థియేటర్లలో సందడి చేయనుంది.

భారీ అంచనాల మధ్య ఈ సినిమా ఫిబ్రవరి 17న థియేటర్లలో విడుదల కాబోతోంది. నివేదా పెతురాజ్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ ను మొదలు పెట్టేసింది చిత్ర బృందం. ఇదిలా ఉండగా విశ్వక్ సేన్ సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై మరొక సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. "రౌడీ ఫెలో" అనే టైటిల్ తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకి కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మధ్యనే నితిన్ హీరోగా "చల్ మోహన్ రంగా" సినిమాకి దర్శకత్వం వహించిన కృష్ణ చైతన్య ఇప్పుడు విశ్వక్ సేన్ తో ఈ సినిమాని రూపొందిస్తున్నారు.

ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్ నుంచి పట్టాలెక్కబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా గురించిన అధికారిక ప్రకటన మరియు మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి. నిజానికి కృష్ణ చైతన్య శర్వానంద్ హీరోగా కూడా ఒక సినిమా చేయాల్సి ఉంది కానీ శర్వానంద్ పెళ్లి పనులు బిజీగా ఉండడం వల్ల ఈ సినిమా ఆలస్యం అవుతూ వచ్చింది. ఈ లోపు కృష్ణ చైతన్య విశ్వక్ సేన్ తో సినిమాని మొదలు పెట్టడానికి రెడీ అయ్యారు. అయితే శర్వానంద్ తో అనుకున్న సినిమాని విశ్వక్ సేన్ తో తీస్తున్నారా లేక ఇది వేరే సినిమానా అని ఇంకా తెలియాల్సి ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories