Vishwak Sen: హిట్ 2 లో వేరే హీరో.. నాని మాస్టర్ ప్లాన్ గురించి చెప్పేసిన విశ్వక్ సేన్..

Vishwak Sen Reveals Reason Behind Leaving HIT 2
x

Vishwak Sen: హిట్ 2 లో వేరే హీరో.. నాని మాస్టర్ ప్లాన్ గురించి చెప్పేసిన విశ్వక్ సేన్..

Highlights

Vishwak Sen: "ఆ!" అనే సినిమాతో నిర్మాతగా మారిన హీరో నాని "హిట్" అనే సినిమాకి కూడా నిర్మాతగా వ్యవహరించారు.

Vishwak Sen: "ఆ!" అనే సినిమాతో నిర్మాతగా మారిన హీరో నాని "హిట్" అనే సినిమాకి కూడా నిర్మాతగా వ్యవహరించారు. క్రైమ్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాలో విశ్వక్ సేన్ హీరోగా కనిపించారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని కూడా సాధించింది. అయితే తాజాగా ఈ సినిమాకి సీక్వెల్ అయిన "హిట్ 2" అనే సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకి రాబోతోంది.

యువ హీరో అడవి శేష్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. అయితే మొదటి పార్ట్ లో హీరోగా నటించిన విశ్వక్ సేన్ ఈ సినిమాలో ఎందుకు హీరోగా నటించడం లేదు అని అభిమానులు సైతం షాక్ అయిన సంగతి తెలిసిందే. "హిట్ 2 కూడా నాతోనే చేద్దామ‌నుకున్నారు. కానీ కాల్షీట్ల ఇబ్బంది వల్ల కుదరలేదు. నా కోసం టీమ్ ని ఆగమ‌న‌డం క‌రెక్ట్ కాదు. అందుకే మ‌రో హీరోతో హిట్ 2 చేస్తున్నారు. నాని అన్న కూడా ఒక్కో పార్ట్ ను ఒక్కో హీరోతో చేస్తే బాగుంటుంది అన్నాడు. అలా హిట్ ఫ్రాంచైజీ హీరో సినిమా సినిమా కీ మారుతూ ఉంటాడు" అని చెప్పుకొచ్చాడు విశ్వక్ సేన్‌.

అంతేకాకుండా నాని హిట్ 2, 3, 4 ఒక్కో హీరోతో తీసి, ఆ హీరోలంద‌రినీ క‌లిపి మ‌రో సినిమా చేయాలి అనుకుంటున్నారట. అంటే ఓ భారీ మ‌ల్టీస్టార‌ర్‌కి ఇప్పటి నుంచే పునాది వేస్తున్నారు అని చెప్పవచ్చు. క‌థ‌ విషయంలో కూడా సినిమా సినిమాకీ సంబంధం ఉండ‌ద‌ని అన్నారు విశ్వక్ సేన్.

Show Full Article
Print Article
Next Story
More Stories