Paagal Movie: 1600 మందిని ప్రేమించిన "పాగల్" ఆగష్టు 14న రాబోతున్నాడు

admin1
Updated on: 10 Aug 2021 1:30 PM IST
Vishwak Sen Paagal Movie is Going to be Release on 14 August 2021
X

పాగల్ పోస్టర్ (ట్విట్టర్ ఫోటో)

Vishwak Sen "Paagal" Movie : హిట్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న విశ్వక్ సేన్ మూవీ 'పాగల్'ను ఈ నెల 14న విడుదల చేయనున్నారు. తాజాగా సినిమాకి సంబందించిన పోస్టర్‌తో అందరి దృష్టిని ఆకర్షించిన చిత్ర బృందం ఇప్పుడు సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. 2 నిమిషాల 16 సెకండ్స్ నడిచిన ఈ వీడియో లో విశ్వక్ సేన్ తన కూల్ లుక్‌తో బాగా ఆకట్టుకున్నాడు. సినిమా పోస్టర్ చూస్తేనే ఇది ఒక ప్రేమకథా చిత్రమని అర్థమవుతోంది. ఇక ట్రైలర్ కూడా చిత్ర కథ ఎలా ఉండబోతోందో ఒక క్లారిటీ ఇచ్చింది. సినిమాలో విశ్వక్ సేన్ ప్రేమ్ అనే పాత్రలో కనిపిస్తాడు. ప్రేమ్ కి కనిపించిన ప్రతి అమ్మాయికి "ఐ లవ్ యూ" చెప్పడం తప్ప ఇంకో పని ఉండదు.

సినిమాలో అతని పాత్ర పైనే చాలా కామెడీ ఉండబోతోందని తెలుస్తోంది. అయితే అలాంటి ప్రేమ్ నిజంగా ఒక అమ్మాయితో ప్రేమలో పడితే ఎలా ఉంటుంది? అనేది సినిమా కథ. "చాలా మందికి "ఐ లవ్ యూ" చెప్పా కానీ నిజంగా ప్రేమించింది మాత్రం నిన్నే" అని ప్రేమ్ హీరోయిన్ నివేద పెతురాజ్ కి చెప్పినా ఆమె ఇతడిని నిరాకరిస్తుంది. మరి ప్రేమ్ పరిస్థితి ఏమైంది? అనే పాయింట్ చుట్టూ మిగతా సినిమా తిరగనుంది.

ట్రైలర్ చూస్తే సినిమా అందరికీ నచ్చే విధంగానే ఉంటుందని తెలుస్తోంది. నరేశ్ కుప్పిలి దర్వకత్వంలో నిర్మాత దిల్‌రాజు స‌మ‌ర్ప‌ణ‌లో బెక్కం వేణుగోపాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సిమ్రాన్ చౌద‌రి, మేఘా లేఖ కూడా ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో క‌నిపించ‌నున్నారు. ర‌ధ‌న్ సంగీతాన్నిఅందిస్తోన్న'పాగల్' చిత్రానికి ఎస్‌. మ‌ణికంద‌న్ సినిమాటోగ్రాఫ‌ర్‌ గా పనిచేస్తున్నారు.

admin1

admin1

Next Story