ఇంటర్వ్యూయర్ పై ఫైర్ అయిన విశ్వక్ సేన్...

Vishwak Sen: ఈ మధ్యనే "పాగల్" సినిమాతో పర్వాలేదు అనిపించిన హీరో విశ్వక్ సేన్...

Shireesha
Updated on: 2 May 2022 7:00 PM IST
Vishwak Sen Fires on Interviewer for Calling him Pagal Sen | Breaking News Today
X

ఇంటర్వ్యూయర్ పై ఫైర్ అయిన విశ్వక్ సేన్...

Vishwak Sen: ఈ మధ్యనే "పాగల్" సినిమాతో పర్వాలేదు అనిపించిన హీరో విశ్వక్ సేన్ తాజాగా ఇప్పుడు "అశోకవనంలో అర్జున కళ్యాణం" సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. రొమాంటిక్ ప్రేమ కథ చిత్రం విడుదల కాబోతున్న ఈ సినిమాలో రుక్సార్ హీరోయిన్గా నటిస్తోంది. విద్యాసాగర్ ఈ సినిమా కి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా త్వరలోనే విడుదల కాబోతోంది.

చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా ఒక టీవీ న్యూస్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వడానికి సిద్ధమయ్యారు విశ్వక్ సేన్. ఇంటర్వ్యూ లో మాట్లాడుతున్న సమయంలో ఇంటర్వ్యూయర్ విశ్వక్ సేన్ ను "పాగల్ సేన్" అని సంబోధిస్తూ, సినిమా తర్వాత డిప్రెషన్ లోకి వెళ్ళాడని ఆరోపించింది. దీంతో చిర్రెత్తుకొచ్చి విశ్వక్ సేన్ తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ తాను డిప్రెషన్లోకి వెళ్లలేదని, ఎవరైతే ఆమెకు ఆ వార్త చెప్పారో ఆ డాక్టర్ నంబర్ తనకు ఇవ్వమని అడిగి, తన ను పాగల్ సేన్ అని పిలిచే హక్కు తనకు లేదని అలా మాట్లాడితే తాను కూడా తన పై పరువు నష్టం దావా వేయాలని అన్నారు విశ్వక్.

హీరో అయినప్పటికీ ఆ ఇంటర్వ్యూయర్ తన స్టూడియో నుంచి విశ్వక్ సేన్ ను వెళ్ళిపొమ్మని అరవగా విశ్వక్ సేన్ లేచి బయటకు వెళ్ళిపోయారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కనీసం గౌరవం ఇవ్వకుండా తనతో అలా మాట్లాడి కావాలనే ఆ ఇంటర్వ్యూయర్ విశ్వక్ సేన్ ను రెచ్చ కొట్టేలా మాట్లాడింది అని అభిమానులు విశ్వక్ సేన్ కు సపోర్ట్ చేస్తున్నారు.

Shireesha

Shireesha

Next Story