Dhamki Movie: వాయిదా పడిన విశ్వక్ సేన్ 'ధమ్కీ' సినిమా

* ఫిబ్రవరి 17 నుండి తప్పుకున్న విశ్వక్ సేన్ సినిమా..

Dhatripriya
Updated on: 7 Feb 2023 8:30 PM IST
Vishvak Sen Film Release Postponed
X

వాయిదా పడిన విశ్వక్ సేన్ సినిమా విడుదల

Das Ka Dhamki: ఈ మధ్యనే "ఓరి దేవుడా" సినిమా తో అలరించిన విశ్వక్ సేన్ "ముఖచిత్రం" అనే సినిమాలో కూడా పాత్రతో బాగానే మెప్పించారు. తాజాగా ఇప్పుడు విశ్వక్ సేన్ హీరోగా స్వీయ దర్శకత్వంలో ప్రేక్షకులు ముందుకు రాబోతున్న సినిమా "దాస్ కా ధమ్కీ". ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలైన చిత్ర టీజర్ మరియు ట్రైలర్ లు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణను అందుకున్నాయి. ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని అభిమానులు కూడా ఆసక్తి ఎదురు చూస్తున్నారు.

నిజానికి ఈ సినిమా ఫిబ్రవరి 17న థియేటర్లలో విడుదల కావాల్సింది. కానీ కొన్ని అనివార్య కారణాలవల్ల ఈ సినిమా విడుదల వాయిదా పడినట్లు గత కొద్ది రోజులుగా వార్తల వినిపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ విషయం గురించి ఈ క్లారిటీ ఇస్తూ సినిమా వాయిదా పడినట్లు ప్రకటించారు విశ్వక్ సేన్. "కొన్ని సీజీ వర్క్స్ ఇంకా పూర్తి కావాల్సి ఉండటంతో మా సినిమా ఈ వారం విడుదల అవటం లేదు. త్వరలోనే కొత్త విడుదల తేదీ ని ప్రకటిస్తాము. త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సినిమాని ఎంజాయ్ చేయడానికి రెడీగా ఉండండి.

ఈసారి థియేటర్లలో ఇచ్చి పడేద్దాం" అంటూ చిత్ర బృందం సినిమా వాయిదా పడినట్లు అధికారికంగా ప్రకటించింది. నివేదా పేతురాజ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో రావు రమేష్, తరుణ్ భాస్కర్, శౌర్య, అక్షర గౌడ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. కరాటే రాజు నిర్మించిన ఈ సినిమాకి లియోన్ జేమ్స్ సంగీతాన్ని అందిస్తున్నారు.


Dhatripriya

Dhatripriya

Next Story