మళ్ళీ ఆ సినిమాను పట్టాలెక్కించనున్న మంచు విష్ణు

మళ్ళీ ఆ సినిమాను పట్టాలెక్కించనున్న మంచు విష్ణు
x
Highlights

వరుస డిజాస్టర్ లతో సతమతమవుతున్న హీరోల లో మంచు విష్ణు కూడా ఒకడు. గత కొంత కాలంగా ఒక్క హిట్ కూడా అందుకోని మంచు విష్ణు తాజాగా తమిళ తెలుగు భాషల్లో 'ఓటర్'...

వరుస డిజాస్టర్ లతో సతమతమవుతున్న హీరోల లో మంచు విష్ణు కూడా ఒకడు. గత కొంత కాలంగా ఒక్క హిట్ కూడా అందుకోని మంచు విష్ణు తాజాగా తమిళ తెలుగు భాషల్లో 'ఓటర్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా త్వరలో విడుదల కాబోతోంది. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. తన ఆశలన్నీ ఆ సినిమాపైనే పెట్టుకున్నాడు మంచు విష్ణు. ఇక ఈ సినిమాను పక్కన పెడితే మూడేళ్ల క్రితం విష్ణు ఒక సినిమా ఓకే చేశాడు. అందులో విష్ణు మహా శివుని భక్తుడైన కన్నప్ప పాత్రలో కనిపించాల్సి ఉంది.

తనికెళ్ల భరణి స్క్రిప్ట్ అందించిన ఈ సినిమా భారీ విజువల్ ఎఫెక్ట్స్తో తెరకెక్కాల్సింది. తనికెళ్ల భరణి ఈ సినిమాకు దర్శకత్వం కూడా వహించాలి. కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమా అటకెక్కింది. అయితే తాజాగా మంచు విష్ణు ఈ సినిమాని మళ్ళీ పట్టాలెక్కించడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ కోసం న్యూజిలాండ్ లో కొన్ని అద్భుతమైన లొకేషన్లల ను వెతికే పనిలో పడ్డట్లు సమాచారం అందుతోంది. ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి. మరి ఈ సినిమాతో అయినా విష్ణు హిట్ అందుకుంటాడో లేదో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories