Hero Vishal: విశాల్‌కు తృటిలో తప్పిన ప్రమాదం..

Hero Vishal:(Twitter)
Hero Vishal: ఓ ఫైటింగ్ సీన్ లో హీరో విశాల్ కొద్దిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.
Hero Vishal: కరోనా కాస్త తగ్గుముఖపట్టడం, లాక్ డౌన్ సడలింపులతో సినిమా షూటింగులు షురూ అయ్యాయి. ఈ క్రమంలోనే మాస్ హీరో విశాల్ 31వ చిత్రం షూటింగ్ హైదరాబాదులో శరవేగంగా సాగుతోంది. అయితే, ఓ ఫైటింగ్ సీన్ లో హీరో విశాల్ కొద్దిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. డూప్ లేకుండా ఫైటింగ్ సీన్లో నటిస్తున్న విశాల్ తల వెనుక భాగంలో ఓ సీసా తగిలింది. అయితే ఆయనకు పెద్దగా గాయాలేమీ కాకపోవడంతో చిత్ర యూనిట్ ఊపిరి పీల్చుకుంది. విశాల్ ఆ ఫైట్ సీక్వెన్స్ ను బ్రేక్ తీసుకోకుండా కొనసాగించడం విశేషం. విశాల్ పాల్గొన్న ఫైట్ దృశ్యాలు సెట్స్ పై ఉన్న మానిటర్ లో చూస్తుంటే ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయి.
దీనిపై హీరో విశాల్ స్పందిస్తూ... కొద్దిలో తప్పించుకున్నానని వెల్లడించారు. ఆ ఫైటర్ తప్పేమీలేదని తెలిపారు. కొంచెం టైమింగ్ తప్పిందని, పోరాట సన్నివేశాల చిత్రీకరణలో ఇలాంటివి సాధారణమేనని పేర్కొన్నారు. భగవంతుడి నిర్ణయం, అందరి ఆశీస్సులతో మళ్లీ షూటింగ్ లో పాల్గొంటున్నానని విశాల్ వెల్లడించారు. కాగా, విశాల్ నటిస్తున్న ఈ చిత్రానికి పి. శరవణన్ దర్శకత్వం వహిస్తుండగా, ఫైట్ మాస్టర్ రవివర్మ ఆధ్వర్యంలో యాక్షన్ సీక్వెన్స్ లు తెరకెక్కిస్తున్నారు.
A close call,lucky escape,no fault of de stunt artist,just mistiming,mishaps do happen in action sequences,
— Vishal (@VishalKOfficial) June 18, 2021
God willing&with all blessings,back 2 shoot&successfully done fight sequence&continuing shoot @ Hyd
tks 2 RaviVarma Master 4 lovely fight sequence,will be a treat 2 watch pic.twitter.com/3wE61jjZ1U
Breaking News: కామన్వెల్త్ గేమ్స్‌లో పీవీ సింధుకు స్వర్ణం
8 Aug 2022 9:28 AM GMTతిరుపతి లడ్డూ ప్రసాదానికి 307 ఏళ్లు
8 Aug 2022 5:03 AM GMTఎంపీ గోరంట్ల న్యూడ్ వీడియోపై స్పందించిన మంత్రి రోజా
7 Aug 2022 12:02 PM GMTనీతి ఆయోగ్ ప్రకటనలపై కౌంటర్ ఇచ్చిన మంత్రి హరీష్ రావు
7 Aug 2022 9:34 AM GMTపీసీసీ చీఫ్ ఒక సమన్వయ కర్త మాత్రమే.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్
6 Aug 2022 7:35 AM GMT
బీహార్‌లో వేడెక్కిన రాజకీయాలు
9 Aug 2022 3:59 AM GMTకొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం.. భారీ వర్షాలకు అవకాశం
9 Aug 2022 3:40 AM GMTమూసీ ప్రాజెక్టుకు పెరుగుతున్న వరద ప్రవాహం
9 Aug 2022 3:29 AM GMTస్వాతంత్య్ర దినోత్సవ వజ్రోత్సవాల సందర్భంగా ఆర్టీసీ బంపర్ ఆఫర్లు
9 Aug 2022 3:09 AM GMTకామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు 61 పతకాలు..
9 Aug 2022 2:30 AM GMT