Virupaksha: రెస్పాన్స్ చూద్దామని థియేటర్‌కి వెళ్తే.. దర్శకుడి ఫోన్ కొట్టేశారు..

సరదాగా తన సినిమా చూడడానికి వెళ్లి ఫోన్ పోగొట్టుకున్న డైరెక్టర్

Arun Chilukuri
Updated on: 22 April 2023 7:30 PM IST
Virupaksha Director Karthik Varma Phone Theft in Theater
X

Virupaksha: రెస్పాన్స్ చూద్దామని థియేటర్‌కి వెళ్తే.. దర్శకుడి ఫోన్ కొట్టేశారు..

Virupaksha: ఏదైనా సినిమా విడుదలైనప్పుడు సినిమాకి ప్రేక్షకులు ఎలా రియాక్ట్ అవుతున్నారు అని తెలుసుకోవడానికి చిత్ర బృందం కూడా థియేటర్లకు వెళ్ళటం చాలా సహజం. రాజమౌళి వంటి స్టార్ డైరెక్టర్ల నుండి నిన్న మొన్న ఇండస్ట్రీకి వచ్చిన కొత్త డైరెక్టర్ల వరకు చాలామంది ఇలా సినిమా విడుదలైనప్పుడు ఏదో ఒక థియేటర్ కి వెళ్లి తాము కూడా ప్రేక్షకుల లాగా సినిమాను చూస్తారు. అలాగే అనుకుని తన సినిమా విడుదలని థియేటర్ కి వెళ్లి ఎంజాయ్ చేయాలని అనుకున్నారు కార్తీక్ వర్మ దండు.

సాయి ధరమ్ తేజ్ హీరోగా నిన్న అనగా ఏప్రిల్ 21, 2023 న థియేటర్లలో విడుదలైన విరూపాక్ష సినిమా కి కార్తీక్ వర్మ దర్శకత్వం వహించారు. పాపం సరదాగా థియేటర్ కి వెళ్లి తన సినిమాని వెండి తెర మీద చూడాలని అనుకున్న కార్తీక్ వర్మకి చేదు అనుభవం ఎదురైంది. సినిమా చూస్తున్నంత సేపు బాగానే ఉంది కానీ సినిమా నుంచి బయటకు వచ్చాక చూసుకుంటే డైరెక్టర్ కార్తీక్ ఫోన్ పోయింది. ఎవరో దుండగుడు డైరెక్టర్ కార్తీక్ ఫోన్ ని కొట్టేశాడు.

మరోవైపు నిర్మాత బాపినీడు కూడా సినిమాని థియేటర్లో చూడడానికి వెళ్లారు కానీ బాపినీడు పర్సు కూడా ఎవరో కొట్టేశారు. ఇంతకీ కొట్టేసిన వాడికి ఆ ఫోన్ డైరెక్టర్ కార్తీక్ వర్మ ది అని తెలుసా లేక తెలియదా అని కొందరు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనా తన సినిమా చూడడానికి వెళ్లి తానే ఇబ్బందుల పాలయ్యాడు కార్తీక్ వర్మ. మరోవైపు మంచి అంచనాల మధ్య విడుదలైన విరూపాక్ష సినిమా మొదటి రోజు నుంచి మంచి రెస్పాన్స్ ను అందుకుంటుంది. వర్డ్ ఆఫ్ మౌత్ కూడా చాలా బాగుండడంతో సినిమా సూపర్ హిట్ అయ్యే దిశగా దూసుకు వెళ్తోంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story