Virataparvam Teaser: ప్రేమ, పోరాటాల మేళవింపుగా 'విరాటపర్వం'

Virataparvam Teaser: రానా, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో వస్తోన్న చిత్రం విరాటపర్వం. వేణు ఊడుగుల దర్శకత్వం వహిస్తున్నారు.

Venkata Chari
Updated on: 18 March 2021 6:33 PM IST
Virataparvam Teaser launched by Megastar Chiranjeevi
X

విరాటపర్వం టీజర్ (ఫొటో ట్విట్టర్)

Virataparvam Teaser: రానా, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో వస్తోన్న సినిమా 'విరాటపర్వం'. వేణు ఊడుగుల దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ హీరో మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ఈ సినిమా ట్రైలర్‌ విడుదలైంది. భూస్వాముల అరాచకాలను తన కవిత్వంతో ప్రజలకు తెలియజేస్తుంటాడు రానా. రానా కవిత్వానికి సాయి పల్లవి ఫిదా అవుతుంది. ప్రేమ కోసం అన్నీ వదిలేసి రానా చెంతకు పయణమవుతుంది.

ఈ క్రమంలో సాయిపల్లవిని చుట్టుముట్టిన సమస్యలేంటి? కామ్రేడ్‌గా రానా ఎందుకు మారాడు? లాంటి విషయాలు ఆసక్తిని కలించనున్నాయి. రానా కవిత్వం చెప్పిన తీరు, సాయి పల్లవి మాటలు ఆకట్టుకుంటున్నాయి. సినిమాపై అంచనాలు పెంచేలా టీజర్ ను మేకింగ్ చేశారు‌. సురేశ్‌ బొబ్బిలి అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంది.

ఈ చిత్రంలో నవీన్‌ చంద్ర, ప్రియమణి, నందితా దాస్‌, నివేదా పేతురాజ్‌, ఈశ్వరీ రావు తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్‌ పతాకంపై సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని సురేశ్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై సురేశ్ బాబు సమర్పిస్తున్నారు. విరాటపర్వం ఏప్రిల్‌ 30న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.


Venkata Chari

Venkata Chari

Next Story