Virata Parvam: ఓటీటీలో విరాటపర్వం?

Virata Parvam: కరోనావైరస్ సెకండ్ వేవ్ కారణంగా థియేటర్లు మరలా మూతపడిన సంగతి తెలిసిందే.

Venkata Chari
Published on: 13 May 2021 3:11 PM IST
Virata Parvam to Get a Digital Release? | Rana Daggubati | Sai Pallavi
X

విరాట పర్వం (పొటో ట్విట్టర్)

Virata Parvam: కరోనావైరస్ సెకండ్ వేవ్ కారణంగా థియేటర్లు మరలా మూతపడిన సంగతి తెలిసిందే. దీంతో విడుదల కాబోయే సినిమా నిర్మాతలు సందిగ్ధంలో పడ్డారు. లాక్‌డౌన్ కారణంగా, థియేటర్ విడుదలకు బదులుగా డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదల చేసేందుకు మొగ్గు చూపిస్తున్నారు నిర్మాతలు.

తాజా నివేదికల ప్రకారం, రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా నటించిన 'విరాట పర్వం' కూడా త్వరలో ఓటీటీలో విడుదల కానుందని సమాచారం వినిపిస్తోంది. ఇప్పటికే మేకర్స్ పలు ఓటీటీలతో చర్చలు ప్రారంభించారని టాక్ వినిపిస్తోంది.

ఓటీటీల నుంచి మంచి ఆఫర్ వస్తే... విరాట పర్వం సినిమా డిజిటల్ హక్కులను విక్రయించేందుకు సిద్ధంగా ఉన్నారంట. టాలీవుడ్‌లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో 'విరాట పర్వం' ఒకటి. దీంతో పలు ఓటీటీలు డిజిటల్ రైట్స్ కోసం పోటీపడుతున్నట్లు తెలుస్తోంది. మంచి ఆఫర్ వస్తే వచ్చే నెలలో ఓటీటీలో రిలీజ్ చేసేందుకు నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే మరిన్ని వివరాలు బయటకు రానున్నాయి.

Venkata Chari

Venkata Chari

Next Story