Virat - Pawan Kalyan: పవర్ స్టార్ యాక్షన్ సూపర్ అంటున్న విరాట్ కొహ్లీ

Virat - Pawan Kalyan: వకీల్ సాబ్ మూవీ పై ఇండియన్ క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా తనదైన శైలి లో ప్రశంసల వర్షం కురిపించాడు

Kranthi
Updated on: 20 Jun 2021 5:29 AM IST
Virat Kohli Praised Power Star Pawan Kalyan Acting in Vakeel Saab Movie in Instagram Live
X

Vakeel Saab, Virat Kohli:(File Image)

Virat - Pawan Kalyan: వకీల్ సాబ్ సినిమా సోషల్ సబ్జెక్ట్ కావడం.. అందులో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించడంతో... సినిమా వైడ్ రేంజ్ పాపులారిటీ తెచ్చుకుంది. సెలెబ్రిటీలు సైతం ఈ సినిమాను చూసి.. అభినందనలు చెబుతున్నారు. ఇక పవర్ స్టార్ యాక్షన్ కు ఫిదా అయిపోతున్నారు. లేటెస్టుగా విరాట్ కొహ్లీ సైతం మనసు పారేసుకున్నాడు. పవర్ స్టార్ యాక్షన్ సూపర్ అంటూ ఆకాశానికెత్తేశాడు. దీంతో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ తెగ ఖషీ అయిపోతూ.. సోషల్ మీడియలో ఈ విషయాన్ని వైరల్ చేస్తున్నారు.

ఏప్రిల్ 9 వ తేదీన భారీ అంచనాలతో విడుదల అయినా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ చిత్రం విడుదల అయినా తోలి రోజు నుండే సూపర్ హిట్ టాక్ ని కైవసం చేసుకొని రికార్డుల మోత మోగిస్తూ ముందుకి దూసుకుపోతుంది,తోలి రోజు నుండే ఈ సినిమాకి ఎన్ని విధాలుగా ఆటంకాలు కలిగిన వాటి అన్నిటిని దాటుకుంటూ బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల కనక వర్షం కురిపిస్తూ పవర్ స్టార్ స్టామినా అంటే ఏమిటో మరోసారి అందరికి నిరూపించింది,

ఇక ఈ సినిమా పై అటు టాలీవుడ్ టాప్ సెలెబ్రిటీల నుండి ప్రశంసల వర్షం కురుస్తున్న సంగతి మన అందరికి తెలిసందే, టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ తో సరిసమానమైన ఇమేజి ఉన్న మహేష్ బాబు కూడా ఈ సినిమా పై ప్రశంసల వర్షం కురిపించిన సంగతి మన అందరికి తెలిసిందే, ఒక్క మహేష్ బాబు మాత్రమే కాదు, జూనియర్ ఎన్టీఆర్ కూడా వకీల్ సాబ్ సినిమా చూసి పవన్ కళ్యాణ్ ని కలిసి గట్టిగ కౌగలించుకున్నాడు అని ఇటీవలే ప్రకాష్ రాజ్ టీవీ 9 కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో తెలిపాడు, ఇలా పవన్ కళ్యాణ్ లాంటి మాస్ ఇమేజి హీరో ఇలాంటి సినిమా చేస్తే రీచ్ ఈ స్థాయి లో ఉంటుంది అని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు, పవన్ కళ్యాణ్ కాకుండా వేరే ఏ స్టార్ హీరో చేసిన వకీల్ సాబ్ సినిమాకి ఈ స్థాయి రీచ్ ఉండేది కాదు అని అనడం లో ఎలాంటి సందేహం లేదు.

ఈ సినిమా పై ఇండియన్ క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా తనదైన శైలి లో ప్రశంసల వర్షం కురిపించాడు, ఆయన ఇటీవల ఇంస్టాగ్రామ్ లో అభిమానులతో నిర్వహించిన లైవ్ చాట్ లో మాట్లాడుతూ ' నేను సౌత్ మూవీస్ కూడా బాగా చూస్తుంటాను, బాహుబలి చూసాను, ఆలా వైకుంఠపురం లో చూసాను, ఇప్పుడు లేటెస్ట్ గా పవన్ జి నటించిన వకీల్ సాబ్ సినిమా చూసాను, చాలా బాగా నచ్చాయని,, పవన్ యాక్షన్ సూపర్' అంటూ విరాట్ కోహ్లీ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా అంతటా వీర గా మారింది.

Kranthi

Kranthi

Next Story