Viraataparvam: వీళ్ల మార్గం అనన్యం.. అసామాన్యం.. ఉమెన్స్ డే స్పెషల్ వీడియో

Viraataparvam: రానా దగ్గుబాటి, సాయి ప‌ల్లవి జంట‌గా నటిస్తున్న చిత్రం 'విరాట ప‌ర్వం'.

Samba Siva Rao
Published on: 8 March 2021 1:35 PM IST
​ Viraataparvam Womens Day Motion Poster
X

Viraataparvam

Viraataparvam:దగ్గుబాటి రానా, సాయి ప‌ల్లవి జంట‌గా నటిస్తున్న చిత్రం 'విరాట ప‌ర్వం'. 'రివ‌ల్యూష‌న్ ఈజ్ ఏన్ యాక్ట్ ఆఫ్ ల‌వ్' అనేది ఈ సినిమా ట్యాగ్‌లైన్‌. అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్సవం ఈ సినిమాకు సంబంధించిన ఓ స్పెషల్ వీడియో రిలీజ్ చేసింది చిత్రబృందం. ఈ వీడియోలో రానా వాయిస్ తో మొదలవుతుంది. ''చరిత్రలో దాగిన కథలకు తెరలేపిన ప్రేమ తనది. ప్రేమ కూడా మానవ స్వేచ్ఛలో భాగమే అని నమ్మిన వ్యక్తిత్వం ఈమెది. మహా సంక్షోభమే ఒక గొప్ప శాంతికి దారి తీస్తుందని నమ్మిన విప్లవం తనది. అడవి బాట పట్టిన అనేక మంది వీరుల తల్లులకు వీళ్లు ప్రతి రూపాలు. వీళ్ల మార్గం అనన్యం.. అసామాన్యం'' అంటూ వచ్చే మోషన్ పోస్టర్ అమితంగా ఆకట్టుకుంటుంది.

'విరాట ప‌ర్వం'లో వెన్నెల అనే పాత్రలో సాయి పల్లవి నటిస్తోంది. ఈ చిత్రంలో ఆమె పాత్ర కీలకం అని తెలుస్తోంది. డి. సురేష్ బాబు స‌మ‌ర్పణ‌లో ఎస్‌.ఎల్‌.వి. సినిమాస్ ప‌తాకంపై సుధాక‌ర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సాయి పల్లవి, ప్రియమణి, నివేదా పేతురాజ్ ,ఈశ్వరి రావు, జరీనా వహాబ్, నవీన్ చంద్ర కీలక పాత్రలు పోషిస్తున్నారు. వేణు ఉడుగుల ద‌ర్శ‌క‌త్వం వహిస్తుండగా.. సురేశ్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను ఏప్రిల్ 30న విడుదల చేయడానికి చిత్రయూనిట్ సన్నాహాలు చేస్తుంది.



Samba Siva Rao

Samba Siva Rao

Next Story