'వి.వి.ఆర్' ఈవెంట్ లో షాక్ ఇచ్చిన చిరు

Mega star Chiranjeevi
x
Mega star Chiranjeevi
Highlights

రామ్ చరణ్ హీరో గా మాస్ డైరెక్టర్ బోయపాటి దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రానున్న 'వినయ విధేయ రామ' సినిమా ప్రీ-రిలీజ్ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. సినీ ఇండస్ట్రీ నుండి బోలెడు మంది సెలెబ్రిటీలు మాత్రమే కాక తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా విచ్చేశారు.

రామ్ చరణ్ హీరో గా మాస్ డైరెక్టర్ బోయపాటి దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రానున్న 'వినయ విధేయ రామ' సినిమా ప్రీ-రిలీజ్ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. సినీ ఇండస్ట్రీ నుండి బోలెడు మంది సెలెబ్రిటీలు మాత్రమే కాక తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా విచ్చేశారు.అయితే అందరి చూపు ముఖ్య అతిధిగా వచ్చిన మెగాస్టార్ చిరంజీవి పైనే ఉన్నాయి అంటే అతిశయోక్తి కాదు. దానికి ముఖ్య కారణం చిరు బాగా సన్నబడిపోవడం. ఆరు నెలల క్రితం వరకు కూడా మెగాస్టార్ బాగా బొద్దుగానే ఉన్నారు. కానీ ఇప్పుడు బాగా చిక్కిపోయారు.

'సైరా' సినిమా కోసం పగలు రాత్రి తేడా లేకుండా చిరు కష్టపడుతున్నారు. అందుకే తన వయసు, తన పాత్ర కి అడ్డం కాకూడదు అని, ముఖంలో ఎలాంటి తేడా కన్పించకుండా, కేవలం బాడీ మాత్రం తగ్గించే ఎక్స్ ర్ సైజ్ లు చేస్తున్నారట చిరు. దానికోసం ఫిట్ నెస్ ట్రైనర్ల ఆధ్వర్యంలో వర్కౌట్లు చేస్తున్నారు మెగాస్టార్. అందుకే 4 నెలల నుంచి తన లుక్ లీక్ అవ్వకుండా జాగ్తత్తపడ్డారు. కానీ చరణ్ సినిమా కోసం రావాల్సి వచ్చింది. చిరు కొత్త స్టైలిష్ లుక్ తో ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చారు.'వి.వి.ఆర్' ఈవెంట్ లో షాక్ ఇచ్చిన చిరు

Show Full Article
Print Article
Next Story
More Stories