గ్రామ కూడళ్ళలో బలగం సినిమా ప్రదర్శన.. కంటనీరు పెట్టుకున్న జనం..

Balagam in Villages: మానవ సంబందాలను ఆవిష్కరించిన గొప్ప సినిమా బలగం.

Arun Chilukuri
Published on: 3 April 2023 3:33 PM IST
Villagers Shed Tears After Watching Balagam Movie at Sircilla
X

గ్రామ కూడళ్ళలో బలగం సినిమా ప్రదర్శన.. కంటనీరు పెట్టుకున్న జనం..

Balagam in Villages: మానవ సంబందాలను ఆవిష్కరించిన గొప్ప సినిమా బలగం. పల్లె పల్లెన.. ప్రతి గడపల్లో ఉండే నిజమైన సంఘటనలను కళ్లకు కట్టేలా చూపించిన సినిమా.. ఎంతో మంది ఆదరాభిమానాలు పొందుతున్న ఈ సినిమాను ఇప్పుడు గ్రామాల్లో పెద్ద స్క్రీన్ పై ప్రదర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం నీలోజిపల్లిలో ప్రదర్శించారు. అయితే సినిమా చూస్తూ.. చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరూ కన్నీరు పెట్టుకున్నారు.

ఈ మూవీకి తాజాగా రెండు ఇంటర్నేషనల్ అవార్డులు కూడా రావడం మరో విశేషం. ప్రియదర్శి, కావ్య కల్యాణ్ రామ్ లీడ్ రోల్స్ లో నటించిన బలగం మూవీ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. లాస్ ఏంజిల్స్ సినిమాటోగ్రఫీ అవార్డ్స్ లో బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీతోపాటు బెస్ట్ సినిమాటోగ్రఫీ అవార్డులను ఈ బలగం సొంతం చేసుకుంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story