బ్రేక్ ఈవెన్ పాయింట్ చేరుకున్న 'విక్రాంత్ రోణ‌'

Vikranth Rona Movie: కన్నడలో స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్న కిచ్చా సుదీప్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే.

Arun Chilukuri
Published on: 1 Aug 2022 1:14 PM IST
Vikrant Rona Enters the Break Even Mode
X

బ్రేక్ ఈవెన్ పాయింట్ చేరుకున్న ‘విక్రాంత్ రోణ‌’

Vikranth Rona Movie: కన్నడలో స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్న కిచ్చా సుదీప్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. "ఈగ" సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన సుదీప్ ఆ తరువాత బాహుబలి, సైరా నరసింహారెడ్డి వంటి సూపర్ హిట్ సినిమాలలో కూడా నటించి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్నారు. తాజాగా "విక్రాంత్ రోణ‌" అనే ఒక ప్యాన్ ఇండియన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు సుదీప్.

అనూప్ భండారి దర్శకత్వం వహించిన ఈ సినిమా జూలై 28న థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా విడుదలైన మొదటి రోజు నుంచి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ ను అందుకుంటుంది. తాజా సమాచారం ప్రకారం "విక్రాంత్ రోణ‌" ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో బ్రేక్ ఈవెన్ పాయింట్ ని చేరుకున్నట్లుగా తెలుస్తోంది. సినిమా తెలుగులో తక్కువ ధరకి అమ్ముడవడంతో బ్రేక్ ఈవెన్ పాయింట్ చేరుకోవడానికి ఈ చిత్రానికి ఎక్కువ సమయం పట్టలేదు.

టికెట్ రేట్లు కూడా తక్కువగా ఉన్నప్పటికీ సినిమాకి మంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తూ ఉండడంతో ప్రేక్షకులు సినిమా చూడడానికి ఆసక్తి చూపించారు. మేజర్, విక్రమ్, చార్లీ 777 వంటి సినిమాలు తర్వాత మళ్లీ బ్రేక్ ఈవెన్ పాయింట్ ని చేరుకున్న సినిమాగా మారింది విక్రాంత్ రోణ‌. ఇక ఇప్పటినుంచి సినిమా కలెక్షన్లు డిస్ట్రిబ్యూటర్లకు లాభాలుగానే మారనున్నాయి. జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నీతా అశోక్ మరియు నిరుప్ భం ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించారు. కంటెంట్ ఉంటే డ‌బ్బింగ్ సినిమాలు కూడా స్ట్రైయిట్ తెలుగు సినిమాలకంటే ఎక్కువ కలెక్ష‌న్లు రాబ‌డ‌తాయ‌ని ఈ సినిమాలు నిరూపించాయి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story