Nagachaitanya 'Thank You' Movie: 'థ్యాంక్‌ యూ' అంటున్న సామ్,చైతూ..

Nagachaitanya 'Thank You' Movie: హీరో అక్కినేని నాగచైతన్య , సమంతల జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు

Krishna
Published on: 2 July 2020 12:30 PM IST
Nagachaitanya Thank You Movie: థ్యాంక్‌ యూ అంటున్న సామ్,చైతూ..
X

Nagachaitanya 'Thank You' Movie: హీరో అక్కినేని నాగచైతన్య , సమంతల జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. సినిమాల్లోనే కాదు బయట కూడా బెస్ట్ జోడీ అని వీరికి పేరుంది. ఇప్పటికే వీరిద్దరూ కలిసి మొత్తం నాలుగు సినిమాల్లో కలిసి నటించారు.. ఏం మాయ చేసావే అనే సినిమాతో మొదలైన వీరి సినీ ప్రయాణం...ఆ తర్వాత మనం, ఆటోనగర్ సూర్య ,మజిలీ సినిమాలతో కొనసాగుతూ వస్తోంది. అయితే తాజాగా మళ్లీ వీరిద్దరూ కలిసి నటించబోతున్నారని వార్తలు వస్తున్నాయి..

విభిన్న కథా చిత్రాల దర్శకుడిగా పేరు పొందిన విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో నాగచైతన్య ఓ సినిమా చేయనున్న ట్లు తెలుస్తోంది.. ఇప్పటికే కథా చర్చలు కూడా ముగిశాయి త్వరలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని తెలుస్తోంది... గతంలో విక్రమ్ కె.కుమార్ దర్శకత్వం వహించిన మనం సినిమాలో నాగచైతన్య, సమంత జంటగా నటించారు.. మళ్లీ ఇదే కాంబినేషన్ రిపీట్ అవుతుండడంతో ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి.. దీనిపైన త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుంది. ఇక ఈ సినిమాను కూడా అన్నపూర్ణ ప్రొడక్షన్స్ పై అక్కినేని నాగార్జున నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి "థాంక్ యూ " అనే టైటిల్ పరిశీలనలో ఉంచారు.. అనూప్ రూబెన్స్ సంగీతం అందించనున్నాడని సమాచారం.

ఇదిలా ఉంటే ప్రస్తుతం నాగ చైతన్య శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న లవ్ స్టోరీ అనే సినిమాలో నటిస్తున్నాడు.. ఇందులో నాగచైతన్య సరసన ఫిదా భామ సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది.. ఇప్పటికే విడుదలైన పాటలు సినిమా పైన మంచి హైప్ క్రియేట్ చేశారు.. దాదాపుగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాని త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.. వాస్తవానికి ఈ సినిమా తర్వాత నాగ చైతన్య పరశురామ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయాల్సి ఉంది. కానీ మహేష్ బాబుతో పరశురాం సినిమా ఫిక్స్ అవడంతో నాగ చైతన్య విక్రమ్ కె.కుమార్ సినిమా ని లైన్ లో పెట్టాడు.


Krishna

Krishna

Next Story