సూర్య సినిమాకి సీక్వెల్ ప్లాన్ చేస్తున్న విక్రమ్

*సూర్య సినిమాకి సీక్వెల్ ప్లాన్ చేస్తున్న విక్రమ్

Rama Rao
Updated on: 16 July 2022 12:00 PM IST
Vikram Kumar is Planning a Sequel to 24 Movie | Tollywood News
X

సూర్య సినిమాకి సీక్వెల్ ప్లాన్ చేస్తున్న విక్రమ్

Vikram Kumar: 2016లో విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకి వచ్చిన సినిమా "24". సూర్య హీరోగా నటించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి రివ్యూలను అందుకున్నప్పటికీ కలెక్షన్ల పరంగా మాత్రం అంతంతమాత్రంగానే నిలిచింది. అయితే తాజా సమాచారం ప్రకారం డైరెక్టర్ విక్రమ్ కుమార్ ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ ను తీసే ప్రయత్నాల్లో బిజీగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

నాగచైతన్య హీరోగా రాశి ఖన్నా హీరోయిన్ గా నటించినా "థాంక్యూ" సినిమాకి దర్శకత్వం వహించిన విక్రమ్ కే కుమార్ ప్రస్తుతం ఈ చిత్ర ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. జులై 22న విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రమోషనల్ ఇంటర్వ్యూలలో భాగంగా మాట్లాడుతూ విక్రమ్ కుమార్ కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేస్తున్నారు.

తాను దర్శకత్వం వహించిన "24" సినిమాకి సీక్వెల్ తీసే ప్లాన్ తనకి ఉందని, ఇప్పటికే దీనికి సంబంధించిన బేసిక్ ఐడియా కూడా రాసుకున్నానని చెప్పారు విక్రమ్ కే కుమార్. "ప్రస్తుతం నేను ఆత్రేయ పాత్రను ఎలా డెవలప్ చేయాలి అనే విషయం గురించి ఆలోచిస్తున్నాను," అని అన్నారు విక్రమ్ కుమార్. ఈ నేపథ్యంలో సూర్య మరియు విక్రమ్ కుమార్ కాంబోలో మరొక సినిమా గురించి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Rama Rao

Rama Rao

Next Story