Mahesh Babu: స్టార్ హీరో ని విలన్ గా మార్చబోతున్న మహేష్ బాబు

Mahesh Babu: మహేష్ బాబు కోసం విలన్ గా మారబోతున్న స్టార్ హీరో

admin1
Published on: 25 Nov 2021 7:29 AM IST
Vikram is Going to be Act as Villain in Mahesh Babus Movie
X
మహేష్ బాబు (ఫైల్ ఇమేజ్)

Mahesh Babu: ఈ మధ్యనే "సరిలేరు నీకెవ్వరు" సినిమా తో బ్లాక్ బస్టర్ అందుకున్న టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పుడు పరశురామ్ దర్శకత్వంలో "సర్కారు వారి పాట" అనే సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా త్వరలోనే విడుదల కాబోతోంది. ఇక ఈ సినిమా తరువాత మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. "అతడు", "ఖలేజా" సినిమాల తర్వాత మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మూడో సినిమా ఇది.

"మహర్షి" సినిమా తర్వాత మహేష్ బాబు సరసన పూజా మళ్లీ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం ప్రముఖ స్టార్ హీరో అయిన విక్రమ్ ని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. "అపరిచితుడు" వంటి సినిమాలతో తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకున్న విక్రమ్ ఇప్పుడు మహేష్ బాబు సినిమా కోసం విలన్ పాత్రలో కనిపించనున్నారు. దీని గురించి అధికారిక ప్రకటన కూడా ఇంకా వెలువడాల్సి ఉంది. ఎస్ ఎస్ థమన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించనున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

admin1

admin1

Next Story