Vikram Movie: టీవీ ప్రీమియర్ టిఆర్పి తో షాక్ ఇస్తున్న విక్రమ్

Vikram Movie: టీవీ ప్రీమియర్ టిఆర్పి తో షాక్ ఇస్తున్న విక్రమ్

Rama Rao
Published on: 5 Nov 2022 8:35 AM IST
Vikram Film Gets Low Television Ratings | Telugu Movie News
X

Vikram Movie: టీవీ ప్రీమియర్ టిఆర్పి తో షాక్ ఇస్తున్న విక్రమ్

Vikram Movie: విలక్షణ నటుడు కమల్ హాసన్ ఈమధ్యనే "విక్రమ్" సినిమాతో మర్చిపోలేని బ్లాక్ బస్టర్ అందుకున్న సంగతి తెలిసిందే. లోకేష్ కనకరాజు దర్శకత్వంలో కార్తి హీరోగా నటించిన "సూపర్ హిట్ అయిన ఖైదీ సినిమాకి ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. అటు థియేటర్ల లో చాలా రోజులు హౌస్ ఫుల్ బోర్డులు పెట్టించిన ఈ సినిమా ఓటీటీలో కూడా మంచి రెస్పాన్స్ ను అందుకుంది.

ఇక తాజాగా ఈ సినిమా టీవీలో కూడా ప్రసారమైంది. అయితే మొదటిసారిగా టీవీలో సినిమా ప్రసారం అయిన రోజున టిఆర్పి అంతంతమాత్రంగా ఉండటం అభిమానులను షాక్ కు గురిచేస్తోంది. విక్రమ్ సినిమా ప్రీమియర్ టీవీ ప్రీమియర్ కు కేవలం 4.42 టిఆర్పి మాత్రమే లభించింది. దీవాలి సందర్భంగా చాలా కొత్త సినిమాలు టీవీలో ప్రసారమయ్యాయి. అందులో విజయ్ హీరోగా నటించిన బీస్ట్ సినిమాకి అత్యంత టి ఆర్ పి లభించింది.

విజయ్ బీస్ట్ కు 12.62 టిఆర్పి లభించగా అజిత్ విశ్వాసం కి 10.27 టిఆర్పి లభించింది. ఇది టీవీలో ప్రసారం కావటం పదవ సారి అయినా సరే రికార్డ్ స్థాయిలో టిఆర్పిని సాధించింది. మరోవైపు అరుణాచలం సినిమా 9.20 తిను అందుకోగా శివ కార్తికేయన్ హీరోగా నటించిన డాన్ సినిమా 3.63 రేటింగ్ను టీఆర్పి అందుకుంది. బాక్స్ ఆఫీస్ వద్ద మంచు కలెక్షన్లు నమోదు చేసుకున్న సినిమా టిఆర్పి పరంగా మాత్రం వెలవెలబోతోందని చెప్పవచ్చు.

Rama Rao

Rama Rao

Next Story