'వారసుడు' విడుదల వాయిదా.. దిల్‌రాజు కీలక ప్రకటన

Vijay’s Vaarasudu Release Post Pone
x

‘వారసుడు’ విడుదల వాయిదా.. దిల్‌రాజు కీలక ప్రకటన

Highlights

‘వారసుడు’ విడుదల వాయిదా.. దిల్‌రాజు కీలక ప్రకటన

Vaarasudu: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న 'వారసుడు' సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్లు నిర్మాత దిల్‌రాజు ప్రకటించారు. తమిళంలో మాత్రం ఈనెల 11నే వారసుడు విడుదలవుతుండగా.. తెలుగులో మాత్రం ఈనెల 14న విడుదల చేస్తున్నట్లు వివరించారు. వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి చిత్రాలను దృష్టిలో పెట్టుకుని తమ చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈమేరకు జనవరి 14న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు తెలిపారు.

సంక్రాంతికి మన తెలుగు హీరోలైన బాలయ్య, చిరంజీవిలకు ఎక్కువ థియేటర్లకు దొరకాలని, వారి సినిమాలు పెద్ద ఎత్తున రిలీజ్ కావాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని దిల్ రాజు పేర్కొన్నారు. ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన వార‌సుడు సినిమాలో విజయ్ సరసన ర‌ష్మిక హీరోయిన్‌గా న‌టించింది. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ మూవీలో శ్రీకాంత్, శ‌ర‌త్‌కుమార్‌, కిక్ శ్యామ్, సంగీత , జ‌య‌సుధ‌, ఖుష్బూ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories