"వారసుడు" ప్రీ రిలీజ్ బిజినెస్ తో షాక్ ఇస్తున్న విజయ్

Vijays Movie which Earned a Huge Amount With Pre-release Business
x

"వారసుడు" ప్రీ రిలీజ్ బిజినెస్ తో షాక్ ఇస్తున్న విజయ్

Highlights

*"వారసుడు" ప్రీ రిలీజ్ బిజినెస్ తో షాక్ ఇస్తున్న విజయ్

Vijay Movie: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తాజాగా ఇప్పుడు తన మొట్టమొదటి డైరెక్ట్ తెలుగు సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో "వారసుడు" అనే టైటిల్తో ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. తెలుగులో విజయ్ కి ఇది మొదటి సినిమా కాగా వంశీ పైడిపల్లి కి ఇది తమిళ్ లో మొదటి సినిమా. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా థియేటర్లలో విడుదల కాబోతోంది. అదే సమయంలో విడుదల కాబోతున్న చిరంజీవి "వాల్తేరు వీరయ్య" మరియు బాలకృష్ణ "వీరసింహారెడ్డి" సినిమాలతో ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద క్లాష్ కాబోతోంది. ఈ సినిమా ఓవర్సీస్ రైట్స్ 35 కోట్లకు అమ్ముడు అవ్వగా, తమిళనాడు రైట్స్ 72 కోట్లకు అమ్ముడయ్యాయి.

ఇక కేరళ మరియు కర్ణాటక రెండిట్లోనూ కలిపి ఈ సినిమా రైట్స్ 15 కోట్ల వరకు బిజినెస్ చేసింది అని చెప్పుకోవచ్చు. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 10 కోట్ల బిజినెస్ చేసే అవకాశం కనిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 140 కోట్ల బిజినెస్ ను చేసింది. ఎంతైనా దిల్ రాజు సపోర్ట్ ఈ సినిమాకి ఉంటుంది కాబట్టి థియేటర్లకు కొదవ ఉండదని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో సినిమాకి హిట్ టాక్ వస్తే కలెక్షన్ల వర్షం కురిసే అవకాశం కనిపిస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories