Vijay - Prabhas: విజయ్ హీరోయిన్ తో రొమాన్స్ చేయనున్న ప్రభాస్..

Vijay - Prabhas: ప్రభాస్ చేతిలో ఆది పురష్, స్పిరిట్, సలార్ వంటి బోలెడు బడా ప్రాజెక్టులు ఉన్న సంగతి తెలిసిందే...

Shireesha
Published on: 18 March 2022 10:27 AM IST
Vijays Master Movie Heroine Malavika Mohanan Going to Act with Prabhas | Live News
X

Vijay - Prabhas: విజయ్ హీరోయిన్ తో రొమాన్స్ చేయనున్న ప్రభాస్.. 

Vijay - Prabhas: ప్రభాస్ హీరోగా నటించిన "రాధేశ్యామ్" సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మారిన సంగతి తెలిసిందే. ఇక ఒకవైపు ప్రభాస్ చేతిలో ఆది పురష్, స్పిరిట్, సలార్ వంటి బోలెడు బడా ప్రాజెక్టులు ఉన్న సంగతి తెలిసిందే కానీ మరోవైపు చిన్న సినిమాల డైరెక్టర్ మారుతి డైరెక్షన్లో ఓ సినిమా చేసేందుకు ఒప్పుకున్నారు ప్రభాస్.

అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకి "రాజా డీలక్స్" టైటిల్ ను అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా గురించిన చాలా ఆసక్తికరమైన వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర లో ఎవరు కనిపించనున్నారు అనే విషయం ఇపుడు హాట్ టాపిక్ గా మారింది.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉంటారని తెలుస్తోంది. ఇప్పటికే పలు హీరోయిన్ల పేర్లు వినిపించాయి. అందులో ఒక పేరు మాళవికా మోహనన్. తాజా సమాచారం విజయ్ సరసన "మాస్టర్" అనే సినిమాలో కనిపించి నటన పరంగా మంచి మార్కులు వేయించుకున్న మాళవిక మోహనన్ ఈ సినిమాలో ప్రభాస్ సరసన ఒక హీరోయిన్గా కనిపించనుంది అని తెలుస్తోంది.

Shireesha

Shireesha

Next Story