Vijayendra Prasad: విజయేంద్రప్రసాద్‌ అనే నేను..

Vijayendra Prasad: సోమవారం పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో ఇటీవల రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన పలువురు సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు.

Arun Chilukuri
Published on: 18 July 2022 4:23 PM IST
Vijayendra Prasad Take Oath In Rajya Sabha Today
X

Vijayendra Prasad: విజయేంద్రప్రసాద్‌ అనే నేను..

Vijayendra Prasad: సోమవారం పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో ఇటీవల రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన పలువురు సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు. రాజ్య‌స‌భ చైర్మ‌న్ హోదాలో ఉప‌రాష్ట్రప‌తి వెంక‌య్య‌నాయుడు కొత్త స‌భ్యుల‌తో ప్ర‌మాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ప్రమాణ స్వీకారం చేయాల్సిందిగా సభలో ఉన్న ప్రముఖ సినీ రచయిత విజయేంద్రప్రసాద్‌ను ఆహ్వానించారు.

సభ్యుల మధ్య నుంచి అభివాదం చేస్తూ ఛైర్మన్‌ పోడియం ముందుకు వచ్చిన విజయేంద్రప్రసాద్‌ ఆంగ్లంలో రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం సభకు మరోసారి అభివాదం చేయగా, కూర్చొని సంతకం చేయాల్సిందిగా రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు ఆయనకు సూచించారు. అనంత‌రం ఆయ‌న పార్ల‌మెంటు ఆవ‌ర‌ణ‌లో మీడియాతో మాట్లాడుతూ దేశం కోసం ప‌నిచేస్తాన‌ని తెలిపారు. రాజ్య‌స‌భలో ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను లేవ‌నెత్తుతానని, ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై జ‌రిగే చ‌ర్చ‌ల్లో ఉత్సాహంగా పాలుపంచుకుంటాన‌ని తెలిపారు. త‌న క‌థ‌లే త‌న‌ను ఇంత దూరం ప్ర‌యాణించేలా చేశాయ‌ని ఆయ‌న తెలిపారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story