షకలక శంకర్‌ను అడ్డుకున్న విజయవాడ పోలీసులు

షకలక శంకర్‌ను అడ్డుకున్న విజయవాడ పోలీసులు
x

Shakalaka Shankar 

Highlights

Shakalaka Shankar : టాలీవుడ్ నటుడు షకలక శంకర్ సేవ కార్య్రమాల్లో ఎప్పుడు ముందే ఉంటారన్న సంగతి తెలిసిందే.. ఆ మధ్య కరీంనగర్ లో కరోనా కారణంగా డబ్బులు లేకా ఇబ్బంది పడుతున్న ఓ ఏడూ కుటుంబాల కోసం ఏకంగా బిక్షాటన చేసి 90 వేలు సమకూర్చాడు శంకర్.

Shakalaka Shankar : టాలీవుడ్ నటుడు షకలక శంకర్ సేవ కార్య్రమాల్లో ఎప్పుడు ముందే ఉంటారన్న సంగతి తెలిసిందే.. ఆ మధ్య కరీంనగర్ లో కరోనా కారణంగా డబ్బులు లేకా ఇబ్బంది పడుతున్న ఓ ఏడూ కుటుంబాల కోసం ఏకంగా బిక్షాటన చేసి 90 వేలు సమకూర్చాడు శంకర్.. ఆ డబ్బులకి తానూ మరో పదివేల రూపాయలని కలిపి మొత్తం లక్ష రూపాయలని వారికి అందజేశాడు శంకర్.. అలాగే మరోసారి కరోనా బాధితుల సహయార్థం విరాళాలు సేకరించడానికి విజయవాడకి వెళ్ళాడు శంకర్.. అయితే అక్కడ పోలీసులు శంకర్ ని అడ్డుకున్నారు.

కరోనా నేపధ్యంలో విరాళాలు సేకరించవద్దునని పోలీసులు వెల్లడించారు. ఇలా అనుమతి లేకుండా విరాళాలు సేకరిస్తే కేసు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు. అయితే దీనిపైన శంకర్ అసహనం వ్యక్తం చేశాడు. కరోనా కారణంగా చాలామంది ఉపాధి కోల్పోయారని, పెద్ద దిక్కు కోల్పోయిన కుటుంబాలని ఆదుకునే ఉద్దేశంతోనే ఈ విరాళాలు సేకరిస్తున్నట్టుగా శంకర్ పేర్కొన్నారు. విరాళాల కోసం ప్రత్యేకంగా ఒక చోటుని నిర్ణయించుకోలేద‌ని, ఎక్కడ విరాళాలు సేకరణ చేయాలనిపిస్తే అక్కడికి వెళ్లి పోయేందుకే విజయవాడకి వచ్చినట్టుగా పోలీసులకి వెల్లడించాడు శంకర్..

ఇక జబర్దస్త్ షో ద్వారా షకలక శంకర్ కమెడియన్ గా మంచి పేరు సంపాదించుకున్నాడు. ఆ తర్వాత శంకర్ మెల్లిమెల్లిగా సినిమా అవకాశాలను అందిపుచ్చుకున్నాడు. కమెడియన్ గానే కాకుండా పలు సినిమాలలో హీరోగా కూడా నటించి మెప్పించాడు.. తాజాగా పరాన్నజీవి చిత్రంలో లీడ్ రోల్ పోషించాడు. దీనికి నూతన్ నాయిడు దర్శకత్వం వహించాడు. ఇటీవలే 'లాస్ట్ గాడ్‌ఫాదర్' అనే సినిమాను శంకర్ మొదలుపెట్టారు. ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ క్లాప్ కొట్టి ఈ సినిమా షూటింగ్‌ను ప్రారంభించారు. చిన్నికృష్ణ ప్రొడక్షన్స్ పతాకంపై గాంధీ మోహన్ రెడ్డి దర్శకత్వంలో వెలంపల్లి ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories