బిగ్‌ అనౌన్స్‌మెంట్‌..తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్న కోలివుడ్ స్టార్ హీరో

Vijay Thalapathy: ఈ కోలీవుడ్‌ స్టార్‌ హీరో విజయ్‌ అభిమానులకు శుభ‌వార్త‌

Samba Siva Rao
Updated on: 30 May 2021 10:46 PM IST
Vijay Tollywood Entry fix
X

Vijay Thalapathy File Photo

Vijay Thalapathy: తెలుగులోనూ మార్కెట్ సంపాదించుకున్నారు తమిళ హీరో విజ‌య్ థ‌ల‌ప‌తి. త‌న సినిమాలు అన్ని త‌మిళంతోపాటు తెలుగులోనూ డ‌బ్ చేసి మార్కెట్ పెంచుకున్నారు. తుపాకీ, మాస్ట‌ర్, విజిల్ ఇలా వ‌రుస హిట్స్ సాధించాడు. తెలుగులోను విజ‌య్ అభిమానులు ఉన్నారు. విజ‌య్ సినిమా కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తారు. తెలుగు చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లో అయితే టాప్ హీరోల‌తో పోటీ ప‌డ‌తాడు విజ‌య్. ఈ ఏడాది మాస్ట‌ర్ మూవీతో తెలుగు ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. మరోవైపు విజయ్‌కు తెలుగులోనూ విపరీతమైన ఫ్యాన్‌ ఫాలోయింగ్ ఉన్న విషయం విదితమే. ప్రస్తుతం విజయ్‌ నెల్సన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రంలో వర్క్‌ చేస్తున్నారు.

ఈ కోలీవుడ్‌ స్టార్‌ హీరో విజయ్‌ అభిమానులకు శుభ‌వార్త‌ ఆయన కథానాయకుడిగా త్వరలోనే తెలుగులోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. టాలీవుడ్‌లో పేరు పొందిన డైరెక్టర్‌ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్‌ ఓ సినిమాలో నటించనున్నారు. ఈ విషయాన్ని తాజాగా వంశీ బయటపెట్టారు. 'విజయ్‌తో ప్రాజెక్ట్‌ ఓకే అయ్యింది. విభిన్నమైన కథ భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రానికి దిల్‌రాజు నిర్మాతగా వ్యవహరించనున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల రీత్యా లాక్‌డౌన్‌ పూర్తైన తర్వాత అధికారికంగా ఈ ప్రాజెక్ట్‌ ప్రకటిస్తాం. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని విశేషాలను నెమ్మదిగా వెల్లడిస్తాం' అని వంశీ తాజాగా ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.

Samba Siva Rao

Samba Siva Rao

Next Story