విజయ్ సినిమాలో స్టార్ హీరో కొడుకు

Vijay Sethupathi Son is Going to Act with Vijay | Tollywood News
x

విజయ్ సినిమాలో స్టార్ హీరో కొడుకు 

Highlights

*విజయ్ సినిమాలో స్టార్ హీరో కొడుకు

Beast Movie: ఈ మధ్యనే "మాస్టర్" సినిమాతో మంచి హిట్ అందుకున్న కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తాజాగా ఇప్పుడు "బీస్ట్" సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ మధ్యనే "డాక్టర్" సినిమాతో సూపర్ హిట్ అందుకున్న దిలీప్ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. బ్లాక్ కామెడీ యాక్షన్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. సెల్వరాఘవన్, యోగిబాబు, జాన్ విజయ్, అపర్ణ దాస్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాలో ఒక స్టార్ హీరో తనయుడు కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఆ స్టార్ హీరో మరెవరో కాదు విజయ్ సేతుపతి. సూపర్ హిట్ సినిమాలతో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న విజయ్ సేతుపతి తనయుడు సూర్య ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ పాత్ర చాలా స్పెషల్ గా ఉండబోతోందని ఈ పాత్రలో సూర్య అయితే బాగుంటుందని దర్శకనిర్మాతలు విజయ్ సేతుపతి ని ఒప్పించి సూర్యని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. కళానిధి మారన్ సన్ పిక్చర్స్ పతాకంపై ఈ సినిమాని నిర్మిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 22న విడుదల కాబోతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories