Vijay Sethupathi: కమల్ హాసన్ మూవీలో విలన్ గా విజయ్ సేతుపతి

Vijay Sethupathi: కమల్ హాసన్ మూవీ విక్రమ్ లో ప్రతినాయకుడి గా విజయ్‌ సేతుపతి నటించనున్నట్లుగా టాక్ నడుస్తోంది.

Kranthi
Updated on: 22 May 2021 11:04 AM IST
Vijay Sethupathi Playing Villain Role against Kamal Haasan
X

Vijay Sethupathi-Kamal Haasan

Vijay Sethupathi: విజయ్ సేతుపతి.. ఇప్పుడు అన్ని భాషల్లోనూ ఫ్యాన్స్ ఉన్న పాన్ ఇండియా యాక్టర్. కేరెక్టర్ ఏదైనా సరే.. ఆ కేరెక్టర్ ను మాత్రమే చూపించే విజయ్ సేతుపతి.. నటుడిగా వందకు రెండొందలు మార్కులు కొట్టేశాడు. అందుకే చిన్న పాత్ర అయినా సరే తమ సినిమాలో విజయ్ సేతుపతి ఉంటే.. మార్కెటింగ్ ఈజీ అనే అభిప్రాయానికి ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు వచ్చేశారు. అందుకే సేతుపతికి వరుస ఆఫర్లు వస్తున్నాయి.

ఉప్పెన సినిమాతో విలన్‏గా రాయనం పాత్రలో నటించాడు విజయ్. ఈ సినిమాతో తన నటనతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు ఈ స్టార్ హీరో. విలన్ పాత్రలో విజయ్ సేతుపతి నటనకు మంచి గుర్తింపు లభించింది. తాజాగా ఈ హీరో ఇప్పుడు మరోసారి విలన్ గా నటించబోతున్నాడట.. అది కూడా ఓ స్టార్ హీరో సినిమాలో.

కమల్ హాసన్.. ప్రస్తుతం శంకర్ డైరెక్షన్ లో ఇండియన్ 2 మూవీ చేస్తున్నాడు. అయితే ఈ మూవీ షూటింగ్ లో ప్రమాదం జరగడంతో ఈ సినిమా తాత్కాలికంగా ఆగిపోయింది. ఇక ఆ తర్వాత కమల్ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో దృష్టి పెట్టాడు. అయితే ఎన్నికల్లో కమల్ హాసన్ ఒక్క చోట కూడా విజయం సాధించలేకపోయాడు. దీంతో మళ్లీ సినిమాలపై దృష్టి పెట్టాడు. "ఖైదీ", "మాస్టర్‌" వంటి సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన డైరెక్టర్ లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో "విక్రమ్‌" సినిమా చేయనున్నాడు కమల్.

పొలిటికల్ సెటైరికల్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విక్రమ్‌ పాత్రంను కమల్ హాసన్ పోషిస్తుండగా ప్రతినాయకుడి పాత్రలో విజయ్‌ సేతుపతి నటించనున్నట్లుగా టాక్ నడుస్తోంది. ఈ సినిమాలో విజయ్‌ సేతుపతి తో పాటు మరో కీలక పాత్రలో ఫాహద్‌ ఫాజిల్‌ నటిస్తున్నారు. ఇక ఇప్పటికే రిలీజైన ఈ టీజర్ అటు కోలీవుడ్ తోపాటు ఇటు టాలీవుడ్ లోనూ… సూపర్ రెస్పాన్స్ అందుకుంది. ఈ సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తుండగా… కరోనా సెకండ్ వేవ్ తగ్గగానే స్టార్ట్ చేయబోతున్నారట.

Kranthi

Kranthi

Next Story