విజయ్ సినిమాని బ్యాన్ చేసిన దేశం

Vijay Movie Was Banned in Kuwait
x

విజయ్ సినిమాని బ్యాన్ చేసిన దేశం

Highlights

Vijay: విజయ్ సినిమాని బ్యాన్ చేసిన ప్రభుత్వం

Vijay: టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ త్వరలోనే "బీస్ట్" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. డాక్టర్ ఫేమ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే తాజా సమాచారం ప్రకారం కువైట్ లో ఈ సినిమా విడుదల ని బ్యాన్ చేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. యూఏఈ వంటి కొన్ని అరబ్ దేశాలు ఈ సినిమాని విడుదల చేస్తున్నప్పటికీ కువైట్ మాత్రం ఈ సినిమాని బ్యాన్ చేసినట్లుగా సమాచారం.

ఈ సినిమాలోని ఒక సన్నివేశంలో చెన్నై లోని ఒక షాపింగ్ మాల్ ను టెర్రరిస్టులు హైజాక్ చేస్తారు. ఇక మన దేశ సినిమాలోని ఇస్లామిక్ టెర్రరిజం అరబిక్ దేశాల్లో చూపిస్తే ప్రజల మనోభావాలు దెబ్బతింటాయని కువైట్ ప్రభుత్వం ఈ సినిమా విడుదలను బ్యాన్ చేసింది. గతంలో కూడా దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన "కురూప్" సినిమాని కూడా ప్రభుత్వం బ్యాన్ చేసింది. పూజా హెగ్డే "బీస్ట్" సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories