Master Movie : రికార్డ్స్ సృష్టిస్తున్న విజయ్ మాస్టర్ మూవీ ప్రోమో

తమిళ హీరో తలపతి విజయ్ ప్రధానపాత్ర పోషించి సినిమా ‘మాస్టర్’. ఈ మూవీ 4వ ప్రోమోను చిత్రబృందం శుక్రవారం రిలీజ్ చేసింది.

Samba Siva Rao
Published on: 9 Jan 2021 6:47 AM IST
Master Movie :  రికార్డ్స్ సృష్టిస్తున్న విజయ్ మాస్టర్ మూవీ ప్రోమో
X

మాస్టర్ మూవీ 

తమిళ హీరో తలపతి విజయ్ ప్రధానపాత్ర పోషించి సినిమా 'మాస్టర్'. ఈ మూవీ 4వ ప్రోమోను చిత్రబృందం శుక్రవారం రిలీజ్ చేసింది. విజయ్‌తో పాటు ప్రముఖ తమిళ సూపర్ స్టార్ విజయ్ సేతుపతి కూడా నటిస్తున్నారు. తెలుగు, తమిళంలో ఈ సినిమా జనవరి 13న విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే టీజర్‌, ప్రోమోలతో ఈ మూవీపై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఈ ప్రొమో విడుదలైన కొద్దిసేపట్లోనే సుమారు ఐదు లక్షల మంది వీక్షించారంటేనే మాస్టర్‌ మ్యాజిక్‌ను ఊహించుకోవచ్చు.

ఈ సినిమాకు లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించగా.. యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ సంగీతం అందించారు. "అందం వాడి చూపేరా" అనే పాట యువతను ఉర్రూతలూగించేలా, అద్భుతంగా ఉంది. అలాగే ఈ లవ్లీ, రొమాంటిక్‌ ప్రోమోలో కాలేజీ లెక్చరర్‌గా మాలవికా మోహనన్ గ్రేస్‌ లుక్‌లో అలరిస్తోంది. మరి తన అందంతో ఏం మాయ చేస్తుందో చూడాలి. ఈ సినిమాలో విజయ్ సేతుపతి ప్రతినాయక పాత్రలో కనిపించనున్నారు.

మరోవైపు తమిళనాడు ప్రభుత్వం సినిమా థియేటర్లు, మల్టీప్లెక్సుల్లో ప్రేక్షకుల సీటింగ్ సామర్థ్యాన్ని 100 శాతం ఆక్యుపెన్సీ నిర్ణయం నుంచి వెనక్కి తగ్గింది. కరోనా నిబంధనల నేపథ్యంలో 50 శాతం మాత్రమే ఉండాలన్న కేంద్రం సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. మరోవైపు భారీ వ్యయంతో నిర్ణించిన చిత్రం కావడంతో ఓపెనింగ్స్ పై సందేహాలు నెలకొన్నాయి.



Samba Siva Rao

Samba Siva Rao

Next Story