"వారసుడు" విషయంలో కోపంగా ఉన్న విజయ్

Vijay Is Angry About The Varasudu
x

"వారసుడు" విషయంలో కోపంగా ఉన్న విజయ్

Highlights

"వారసుడు" విషయంలో విజయ్ లెక్కలు ఫ్లాప్ అయ్యాయిగా..

Vijay: కోలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన విజయ్ తాజాగా ఇప్పుడు "వారసుడు" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు. "మహర్షి" ఫేమ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. తమిళ్ లో మాత్రమే కాక తెలుగు ప్రేక్షకులలో కూడా మంచి ఫాన్ ఫాలోయింగ్ ఉన్న విజయ్ మొట్టమొదటిసారిగా డైరెక్ట్ తెలుగు సినిమాతో ప్రేక్షకుల ముందుకి వస్తున్నారు.

ఈ సినిమా ఖచ్చితంగా బాక్సాఫీస్ వద్ద వర్కౌట్ అవుతుంది అని విజయ్ తో పాటు అభిమానులు కూడా అనుకున్నారు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తుంటే ఈ సినిమా విషయంలో విజయ్ ప్లాన్ వర్కౌట్ అయ్యేలాగా కనిపించడం లేదు. ఈ సినిమా విషయంలో విజయ్ వేసిన లెక్కలు తప్పయ్యేలాగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా సినిమా ట్రైలర్ విడుదల తోనే సినిమాపై అంచనాలు భారీగా పడిపోయాయి. సినిమా ట్రైలర్ చూస్తే వంశీ పైడిపల్లి చాలా వరకు టాలీవుడ్ లో హిట్ అయిన సినిమాల నుంచి కొన్ని కొన్ని సన్నివేశాలను తీసి సినిమాలో పెట్టేసినట్లు అనిపిస్తోంది.

దీంతో తెలుగు రాష్ట్రాల్లో సినిమాపై ఉన్న బజ్ బాగా తగ్గిపోయింది. అంతేకాకుండా జనవరి 11న విడుదల కావాల్సిన ఈ సినిమా ఇప్పుడు 14కి వాయిదా పడింది. కానీ తమిళ్ వర్షన్ మాత్రం జనవరి 11న విడుదల కాబోతోంది. ఒకవేళ ఆ తమిళ్లో ఈ సినిమాకి మంచి టాక్ రాకపోతే తెలుగులో కూడా సినిమా కలెక్షన్లు తగ్గిపోయే అవకాశం ఉంది. ఈ విషయాల వల్ల విజయ్ కూడా చిత్ర బృందంపై చాలా కోపంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories