Beast Movie: బీస్ట్ సినిమా డైరెక్టర్ పై విజయ్ తండ్రి ఆగ్రహం..

Beast Movie: ఒక సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా అభిమానులు సినిమా గురించి ఏమైనా నెగటివ్ కామెంట్లు చేస్తారేమో కానీ...

Arun Chilukuri
Updated on: 20 April 2022 5:01 PM IST
Vijay Father SA Chandrasekhar Unhappy with Beast Movie
X

Beast Movie: బీస్ట్ సినిమా డైరెక్టర్ పై విజయ్ తండ్రి ఆగ్రహం..

Beast Movie: ఒక సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా అభిమానులు సినిమా గురించి ఏమైనా నెగటివ్ కామెంట్లు చేస్తారేమో కానీ ఆ సినిమా హీరో, హీరోయిన్, డైరెక్టర్ తదితరుల కుటుంబ సభ్యులు మాత్రం సినిమా గురించి ఎప్పుడు గొప్పగానే చెప్తారు. కానీ తమిళ సూపర్ స్టార్ విజయ్ హీరోగా నటించిన "బీస్ట్" సినిమా విషయం లో మాత్రం స్వయానా విజయ్ తండ్రి ఎస్ ఎ చంద్రశేఖర్ నెగటివ్ గా మాట్లాడడంతో అభిమానులు సైతం షాక్ అవుతున్నారు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో విజయ్ హీరోగా నటించిన "బీస్ట్" సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది.

ఈ నేపథ్యంలో విజయ్ తండ్రి చంద్రశేఖర్ మాట్లాడుతూ "అరబిక్ కుతు పాట దాకా సినిమాని బాగానే ఎంజాయ్ చేశాను. ఆ తర్వాత సినిమా ఆసక్తికరంగా లేదు" అని చెప్పిన చంద్రశేఖర్, "సినిమా మొత్తం విజయ్ పైనే ఆధారపడి నడిచింది కానీ స్టోరీ మరియు ఎక్జిక్యూషన్ సరిగ్గా లేవు" అని అన్నారు. ఇక ఈ మధ్య డైరెక్టర్ లు ఒకటి రెండు మంచి సినిమాలు తీసి స్టార్ హీరోలతో సినిమాలు చేసే అవకాశం పొందుతున్నారు అని హీరో స్టార్ డం వల్లే సినిమా హిట్ అవుతుంది అనుకుంటారని, తమ స్టైల్ లో సినిమా తీసి ఎంటర్టైన్మెంట్ ఎలిమెంట్లు కూడా జత చేయాలి మరియు ఇంకో రెండు పాటలు కూడా ఉంటే బావుండేది అని అన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story