నాని డైరెక్టర్ కి అవకాశం ఇచ్చిన విజయ్ దేవరకొండ

*నాని డైరెక్టర్ తో చేతులు కలపనున్న విజయ్ దేవరకొండ

Rama Rao
Updated on: 25 May 2022 7:30 PM IST
Vijay Deverakonda Working With Director Mohana Krishna Indraganti
X

నాని డైరెక్టర్ కి అవకాశం ఇచ్చిన విజయ్ దేవరకొండ

Vijay Deverakonda: వరుస డిజాస్టర్ లతో సతమతమవుతున్న యువ హీరో విజయ్ దేవరకొండ తాజాగా ఇప్పుడు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో "లైగర్" సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకున్న విజయ్ దేవరకొండ ఈ సినిమా తర్వాత మరొక రెండు సినిమాలను లైన్ లో ఉంచాడు. ఒకవైపు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో "జనగణమన" అంటూ మరొక సినిమా మొదలు పెట్టేసిన విజయ్ దేవరకొండ మరోవైపు "నిన్నుకోరి" ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వంలో సమంత హీరోయిన్ గా ఒక సినిమా షూటింగ్ తో కూడా బిజీగా ఉన్నారు.

అయితే తాజాగా విజయ్ దేవరకొండ మరొక దర్శకుడికి ఇప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న పేరున్న డైరెక్టర్లలో ఒకరైన ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ ఒక సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాని నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది.

ఇదివరకు నాని హీరోగా అష్టాచమ్మా, జెంటిల్ మాన్ సినిమాలు తీసిన ఇంద్రగంటి "వీ" సినిమాతో మాత్రం పెద్దగా మెప్పించలేకపోయారు. ఈ సినిమా ఓటీటీ లో మంచి ధరకు అమ్ముడైనప్పటికీ ఆడియన్స్ నుంచి మాత్రం నెగిటివ్ రెస్పాన్స్ ను ఎక్కువగా అందుకుంది. కానీ ఒక కథ తో విజయ్ దేవరకొండ ను మెప్పించిన ఇంద్రగంటి ఇప్పుడు విజయ్ హీరోగా సినిమా మొదలు పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది.

Rama Rao

Rama Rao

Next Story