Vijay Deverakonda: నా అభిమాన నటులు వీళ్లే అంటున్న విజయ్ దేవరకొండ

* "కింగ్ అఫ్ ది హిల్" అనే నిర్మాణ సంస్థ తో ఒక నిర్మాతగా కూడా మారిపోయారు విజయ్ దేవరకొండ.

admin1
Updated on: 8 Nov 2021 1:17 PM IST
Vijay Deverakonda says in an Interview that Ranbir Kapoor and Mahesh Babu is the Favourite Actors
X

నా అభిమాన నటులు వీళ్లే అంటున్న విజయ్ దేవరకొండ(ఫైల్ ఫోటో)

Vijay Deverakonda: "కింగ్ అఫ్ ది హిల్" అనే నిర్మాణ సంస్థ తో ఒక నిర్మాతగా కూడా మారిపోయారు విజయ్ దేవరకొండ. తరుణ్ భాస్కర్ ని హీరోగా పెట్టి "మీకు మాత్రమే చెప్తా" అనే సినిమాతో విజయ్ దేవరకొండ మెప్పించారు.

తాజాగా విజయ్ దేవరకొండ నిర్మించిన సినిమా "పుష్పక విమానం". విజయ్ దేవరకొండ తమ్ముడు ఈ సినిమాలో హీరోగా కనిపించారు. ఈ మధ్యనే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. మంచి అంచనాల మధ్య ఈ సినిమా నవంబర్ 12న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది.

ఈ సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు దేవరకొండ అన్నదమ్ములు. ఇప్పటికే విజయ్ దేవరకొండ మరియు ఆనంద్ దేవరకొండ కలిసి కలిసి కొన్ని ఇంటర్వ్యూలలో కూడా పాల్గొన్నారు. తాజాగా మాట్లాడుతూ తన అభిమాన నటీనటులను గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు విజయ్ దేవరకొండ.

తనకి ఇష్టమైన హీరో ఎవరు అని అడగగా రన్బీర్ కపూర్ మరియు మహేష్ బాబు అంటే తనకు చాలా ఇష్టమని చెప్పారు. ఇక హాలీవుడ్లో డెంజెల్ వాషింగ్టన్ మరియు మెరిల్ స్ట్రీప్ అంటే కూడా చాలా ఇష్టమని విజయ్ దేవరకొండ అన్నారు.

మరోవైపు విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో "లైగర్" సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే ఈ సినిమాలో హీరోయిన్గా కనిపించనుంది.

admin1

admin1

Next Story