Vijay Deverakonda: ముగ్గురు దర్శకులను లైన్లో పెట్టిన విజయ్ దేవరకొండ

admin1
Updated on: 18 Aug 2021 1:53 PM IST
Vijay Deverakonda Ready to Start The New Movies With Three Star Directors
X

విజయ్ దేవరకొండ (ఫైల్ ఫోటో)

Vijay Deverakonda: ఈ మధ్యనే "వరల్డ్ ఫేమస్ లవర్" సినిమాతో డిజాస్టర్ అందుకున్న టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ "జాతిరత్నాలు" సినిమాలో ఒక క్యామియో పాత్రలో కనిపించారు. తాజాగా విజయ్ దేవరకొండ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సినిమాతో బిజీగా ఉన్నారు. బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయం కాబోతోంది. అయితే మరో వైపు విజయ్ దేవరకొండ తదుపరి సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన వార్తలు ఇప్పుడు నెట్లో హల్ చల్ చేస్తున్నాయి. విజయ్ దేవరకొండ చేతిలో ముగ్గురు బడా డైరెక్టర్ సినిమాలున్నాయి. అందులో విజయ్ దేవరకొండ ఏ సినిమా సెట్స్ పైకి తీసుకువెళతాడు అనేది ఇంకా తెలియాల్సి ఉంది.

హరీష్ శంకర్ మరియు బోయపాటి శ్రీను దర్శకత్వంలో విజయ్ దేవరకొండ సినిమాలు సైన్ చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు సుకుమార్ తో కూడా విజయ్ దేవరకొండ ఒక సినిమా చేయబోతున్నాడు. అయితే ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యే దాకా సుకుమార్ మరో సినిమా సూచనలు లేవు కాబట్టి విజయ్ దేవరకొండ బోయపాటి శ్రీను లేక హరీష్ శంకర్ లలో ఒకరితో సినిమా కి సిద్ధమవ్వాలి. మరి ఈ ఇద్దరి దర్శకులలో ఎవరితో విజయ్ తో సినిమా చేయడానికి రెడీ అవుతాడో తెలియాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే. మరోవైపు పూరి జగన్నాథ్ 'లైగర్' సినిమా విడుదల తేదీ గురించి అధికారిక ప్రకటన ఇంకా విడుదల చేయాల్సి ఉంది.

admin1

admin1

Next Story