Vijay Deverakonda- Rashmika: వైరల్ అవుతున్న క్రేజీ జంట డిన్నర్ డేట్ ఫొటో?

Vijay Deverakonda- Rashmika: టాలీవుడ్ లో క్రేజీ జోడీగా పేరు పొందారు విజయ్ దేవరకొండ- రష్మిక మందన్న.

Venkata Chari
Updated on: 26 March 2021 11:06 AM IST
Vijay Deverakonda- Rashmika Mandanna Spotted At Mumbai Hotel
X

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న (పొటో ట్విట్టర్)

Vijay Deverakonda- Rashmika: టాలీవుడ్ లో క్రేజీ జోడీగా పేరు పొందారు విజయ్ దేవరకొండ- రష్మిక మందన్న. 'గీతగోవిందం' సినిమాలో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేసి ఆకట్టుకున్న ఈ జంట... 'డియర్ కామ్రెడ్' సినిమాతో మరోసారి ఆకట్టుకున్నారు. దీంతో ఆ మధ్య విజయ్ దేవరకొండ- రష్మిక జోడీ పై కొన్ని రూమర్స్ సోషల్ మీడియాను షేక్ చేశాయి. వాళ్ళిద్దరి మధ్య సీక్రెట్ రిలేషన్ షిప్ కొనసాగుతుందని వార్తలు వినిపించాయి.

నటుడు రక్షిత్ శెట్టితో రష్మిక మందన్న ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ కావడానికి విజయ్ దేవరకొండే కారణం అనే రూమర్లు వినిపించాయి. దీంతో ఈ ఇష్యూ జనాల్లో హాట్ టాపిక్ గా మారింది. అయితే గాసిప్స్‌ని పెద్దగా పట్టించుకోని ఈ జంట.. ఎవరి ప్రాజెక్ట్స్‌తో వారు బిజీగా ఉంటున్నారు. విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో 'లైగర్' సినిమా చేస్తున్నాడు. అలాగే రష్మిక సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప' సినిమాలో నటిస్తోంది.

కాగా, తాజాగా విజయ్- రష్మిక ముంబైలోని ఓ ప్రముఖ రెస్టారెంట్ వద్ద కెమెరాకు చిక్కారు. దీంతో వారి ఎఫైర్ కు సంబంధించిన విషయాలు మరోసారి చర్చల్లోకి వచ్చాయి. ముంబైలోని ఓ స్టార్ హోటల్‏లో డిన్నర్‏కు వెళ్లిన ఈ జంట.. డ్రెస్సింగ్ తో పాటు, రష్మిక చేతిలో ఫ్లవర్ బొకే కనిపించడంతో వైరల్‌గా మారారు.

అయితే, సిద్ధార్ధ్ మ‌ల్హోత్రా హీరోగా న‌టిస్తున్న `మిష‌న్ మ‌జ్ను` సినిమాతో ర‌ష్మిక బాలీవుడ్‌కు ప‌రిచ‌యం కానుంది. ఈ నేపథ్యంలో ఈ బ్యూటీ ముంబై చేరుకుంది. విజయ్ దేవరకొండ 'లైగర్' షూటింగ్ కూడా ముంబైలోనే జరుగుతుండడంతో..ఆయన కూడా కొన్ని రోజులగా అక్కడే మకాం వేశారు. షూటింగ్స్‌తో ఇద్దరూ బిజీగా ఉన్నా.. ఇలా ఓకే ప్లేస్‌లో కలవడంతో డేట్‌కి వెళ్లారనే టాక్ వినిపిస్తోంది. ఏదేమైనా.. వీరి ఫొటో ప్రస్తుతం వైరల్ గా మారింది.

Venkata Chari

Venkata Chari

Next Story