Mumbai Airport: విజయ్‌తో రష్మిక వెకేషన్.. పిక్స్ వైరల్..

Vijay Deverakonda, Rashmika Mandanna Spotted at Mumbai Airport
x

Mumbai Airport: విజయ్‌తో రష్మిక వెకేషన్.. పిక్స్ వైరల్..

Highlights

Mumbai Airport: విజయ్‌తో రష్మిక వెకేషన్.. పిక్స్ వైరల్..

Mumbai Airport: "గీత గోవిందం" సినిమాతో మొట్టమొదటిసారిగా వెండితెరపై జంటగా కనిపించిన రష్మిక మందన్న మరియు విజయ్ దేవరకొండ ఆ తర్వాత "డియర్ కామ్రేడ్" అనే సినిమాలో కూడా కలిసి నటించారు. అయితే "గీతాగోవిందం" సినిమా బ్లాక్ బస్టర్ అవడంతో ఆ సినిమా తర్వాత నుంచి వీరిద్దరూ నిజజీవితంలో కూడా డేటింగ్ చేస్తున్నారని త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అని ఎన్నో పుకార్లు ఎప్పటికప్పుడు బయటకు వస్తూనే ఉన్నాయి.

తాజాగా తమ మధ్య ఉన్నది కేవలం స్నేహం మాత్రమే అని విజయ్ దేవరకొండ మరియు రష్మిక మందన్న పలు సార్లు స్పష్టం చేసినప్పటికీ వీరిద్దరూ చేస్తున్న పనులు మాత్రం ఎప్పటికప్పుడు వారిపై వస్తున్న పుకార్లకు ఆజ్యం పోస్తూనే వస్తున్నాయి. తాజాగా ఒకరి తర్వాత ఒకరు వెంట వెంటనే వీరు ఎయిర్ పోర్ట్ వద్ద కనిపించడంతో ఈ పుకార్లు మరింత ఉపందుకున్నాయి.

వివరాల్లోకి వెళితే ఈ మధ్యనే "లైగర్" సినిమాతో మర్చిపోలేని డిజాస్టర్ అందుకున్న విజయ్ దేవరకొండ కొంత కాలం పాటు వెకేషన్ కి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో మాల్దీవ్స్ వెళ్లడానికి ముంబై ఎయిర్పోర్ట్ చేరుకున్నారు. మరోవైపు "పుష్ప 2" సినిమా షూటింగ్ మొదలు పెట్టే ముందే ఒక వెకేషన్ కి వెళ్ళాలని అనుకున్న రష్మిక మందన్న కూడా మాల్దీవ్స్ వెళ్లడానికి ఎయిర్ పోర్ట్ లో దర్శనమిచ్చింది. దీంతో వీరిద్దరూ కలిసి మాల్దీవ్స్ వెళ్లి వెకేషన్ ఎంజాయ్ చేయబోతున్నారు అని పుకార్లు మరొకసారి ఊపందుకున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories