Liger Movie Update: గోవాలో షూటింగ్ జరుపుకుంటున్న లైగర్

* గోవా తర్వాత ఫారిన్ వెళ్లనున్న లైగర్ టీమ్

admin1
Updated on: 4 Sept 2021 6:31 PM IST
Vijay Deverakonda Liger Movie Shooting Resumes in Goa
X

విజయ్ దేవరకొండ 

Liger Movie Update: టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుస డిజాస్టర్ లతో సతమవుతున్నాడు. తాజాగా తన ఆశలన్నీ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రాబోతున్న "లైగర్" పైనే పెట్టుకున్నాడు ఈ యువ హీరో. ఈ సినిమాతో బాలీవుడ్ లో కూడా విజయ్ తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. బాలీవుడ్ స్టార్ కిడ్ అనన్య పాండే ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్లు ఇప్పటికే అందరి దృష్టిని ఆకర్షించడం తో సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ కూడా వాయిదా పడింది. ఈమధ్యనే తిరిగి పట్టాలెక్కిన ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు శరవేగంగా సాగుతోంది.

తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర బృందం ఇప్పుడు షూటింగ్ నిమత్తం గోవా చేరుకున్నారు. సినిమాకి సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాల షూటింగ్ ఇప్పుడు గోవా లో జరుగుతోంది. ఇంకో ఆసక్తికరమైన విషయమేమిటంటే గోవా షెడ్యుల్ తర్వాత చిత్రబృందం మరొక షెడ్యుల్ కోసం ఏకంగా ఫారిన్ వెళ్ళబోతున్నారట. అక్కడ కొన్ని యాక్షన్ సన్నవేశాలతో పాటు క్లైమాక్స్ పార్ట్ షూటింగ్ కూడా జరగబోతోంది. పూరి జగన్నాథ్ మరియు ఛార్మి కౌర్ ఈ సినిమాని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఎలా ఉండబోతోందో అని విజయ్ అభిమానులతో పాటు పూరి అభిమానులు కూడా అంతే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

admin1

admin1

Next Story